కాలువలో వడ్ల లారీ బోల్తా .. తడిసిన బస్తాలు
నస్రుల్లాబాద్(బాన్సువాడ): మండలంలోని బొప్పాస్‌పల్లి గ్రామ సమీపంలో గల నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటర్ 26కు చెందిన ఉపకాలువలో లారీ అదుపు తప్పి బోల్తా పడింది. బైరాపూర్ పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో కాంట పెట్టిన ధాన్యాన్ని రైస్ మిల్లుకు తీసుకుని వెళ్తుండగా గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. లారీలో బొప్పాస్ పల్లి గ్రామానికి రైతులవి 796 బస్తాలు ఉన్నాయి.వారం రోజుల పాటు ఎండ బెట్టిన ధాన్యం మళ్లీ తడిసిపోవడంతో రైస్ మిల్లు వారు తిరిగి పంపిస్తారని రైతులు ఆవేదన చెందుతున్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
చెరువులో చేపల మృత్యువాత
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని వదల్‌పర్తి గ్రామశివారులోగల చెరువులో చేపలు మృత్యువాత పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. ఇటీవల పెరిగిన ఎండల తీవ్రతతో చేపలు మృత్యువాత పడుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. చెరువులో ప్రస్తుతం సుమారు 5వేల చేపలు మృత్యువాత పడినట్లు వారు పేర్కొన్నారు.
కాలువలో వడ్ల లారీ బోల్తా .. తడిసిన బస్తాలు


