కల్లుదుకాణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దాడి
ఎడపల్లి(బోధన్): మండలంలోని జానకంపేట్ గ్రా మంలో అనుమతి లేకుండా కల్లు విక్రయిస్తున్న దు కాణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. అర్సపల్లి గ్రామానికి చెందిన అమర శ్రీనివాస్‌గౌడ్ లైసెన్స్ లేకుండా కల్లు విక్రయించడంతో కేసు నమోదు చేసి బోధన్ ఎకై ్సజ్ పోలీసులకు అప్పగించారు.దుకాణంలో నిల్వ ఉన్న 350 లీటర్ల కల్లును అధికారులు పా రబోసారు.సీఐ స్వప్న,హెడ్ కానిస్టేబుల్ రాజన్న, కానిస్టేబుళ్లు హమీద్, ఉత్తం, శ్యామ్, ఆశన్న పాల్గొన్నారు.
కల్తీ కల్లు అమ్మినందుకు
ఒకరి రిమాండ్
బాన్సువాడ: బీర్కూర్ మండలంలోని దామరంచ గ్రామంలో కల్తీ కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురికావడంతో కల్లు అమ్మిన ఒకరిని రిమాండ్ చేసినట్లు సీఐ రాజేష్ గురువారం తెలిపారు. దుర్కి గ్రామానికి చెందిన లకా్‌ష్మ్‌గౌడ్, సురేందర్‌గౌడ్‌ల దగ్గర నుంచి కల్లు కొనుగోలు చేసి అమ్మినందుకు దామరంచ గ్రామానికి చెందిన గంగాధర్‌గౌడ్‌ను రిమాండ్ పంపించామన్నారు. సిబ్బంది సిబ్బంది శ్రీనివాస్,సంగమేశ్వర్ ఉన్నారు.


