రజతోత్సవ సభకు భారీ జన సమీకరణ
భిక్కనూరు: హనుమకొండలోని ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరగనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ వేడుకలకు భారీ జన సమీకరణ చేయనున్నట్లు కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చెప్పారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రజతోత్సవ వేడుకలు నిర్వహించనున్నామన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామము నుంచి పార్టీ శ్రేణులతో పాటు అభిమానులను పెద్ద ఎత్తున తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. ప్రతి గ్రామానికి వాహనాలను సమకూర్చడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు మల్లేశం, సిద్ధిరామేశ్వర ఆలయ పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ యాదగిరి, రామేశ్వరపల్లి అంతంపల్లి సొసైటీ అధ్యక్షులు నాగర్తి భూమి రెడ్డి, తదితరులున్నారు.
కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్


