హనుమాన్ జయంతికి ఆలయాలు ముస్తాబు
మద్నూర్/కామారెడ్డి రూరల్/బాన్సువాడ రూరల్/సదాశివనగర్/బీబీపేట/నిజాంసాగర్ : జిల్లావ్యాప్తంగా శనివారం హనుమాన్ జయంతి పురస్కరించుకొని ఆలయాలను ముస్తాబు చేశారు. పలు గ్రామాల్లో ఆలయాలను కొత్త రంగులతో తీర్చిదిద్దారు.మద్నూర్ మండలం సలాబత్‌పూర్ హనుమాన్ ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ రాంపటేల్ తెలిపారు. ప్రతి సంవత్సరం జరిగే హనుమాన్ జయంతి ఉత్సవాలకు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు.
హనుమాన్ జయంతికి ఆలయాలు ముస్తాబు
హనుమాన్ జయంతికి ఆలయాలు ముస్తాబు


