విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తాం
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తామని ఎస్‌ఈ శ్రావణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని ఆయా గ్రామాల్లో నూతనంగా వేస్తున్న పోల్స్‌ను పరిశీలించారు. శెట్పల్లిసంగారెడ్డి, బొల్లారం 33 కేవీ మధ్య నిరుపయోగంగా ఉన్న 6కేవీ, 33 కేవీ లైను ఉపయోగంలోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. దీంతో 5 సబ్ స్టేషన్లు బొల్లారం, బిక్కనూరు, శెట్పల్లిసంగారెడ్డి, పర్మళ్ల, కన్నాపూర్ గ్రామాల మధ్య ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే వేరే సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ఇందుకోసం 15 అదనపు పోల్స్ వేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఈ విజయ్‌సారథి, ఏడీ మల్లేశం, ఏఈ హరీష్‌రావు, లైన్ ఇన్‌స్పెక్టర్ కిష్టయ్య, సిబ్బంది పాల్గొన్నారు.


