న్యాయ సేవలపై అవగాహన కలిగి ఉండాలి
దోమకొండ : న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా జడ్జి నాగరాణి పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో గడికోట ట్రస్టు, తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్ల వేసవికాల ప్రత్యేక శిబిరంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. న్యాయం ఉచితంగా దొరుకుతుంది అనే అంశాన్ని వివరించారు. న్యాయ సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో గడికోట ట్రస్టు మేనేజర్ బాబ్జీ, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు, సౌత్ క్యాంపస్ అధ్యాపకులు పాల్గొన్నారు.
నేడు పట్టుపరిశ్రమపై అవగాహన సదస్సు
బీబీపేట: యాడారం గ్రామ రైతు వేదికలో శనివారం పట్టు పరిశ్రమపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా పట్టు పరిశ్రమ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టు పరిశ్రమను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా సదస్సు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పట్టు పరిశ్రమ ద్వారా వాణిజ్య పంటల కంటే అధిక ఆదాయం పొందవచ్చని తెలిపారు. పట్టుపరిశ్రమపై ఆసక్తి ఉన్న రైతులు అవగాహన సదస్సులో పాల్గొనాలని కోరారు.
ఐఫోన్ వినియోగదారుల కోసం
టీజీఎన్పీడీసీఎల్ యాప్
కామారెడ్డి అర్బన్ : ఐ ఫోన్ వినియోగదారుల కోసం టీజీఎన్పీడీసీఎల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎస్‌ఈ శ్రావణ్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ యాప్ లో సంఘటనల రిపోర్టు, ఫిర్యాదులు, సెల్ఫ్ రీడింగ్, బిల్లుల చెల్లింపు, కొత్త కనెక్షన్లు ఎలా తీసుకోవాలి, పేరు, లోడ్ మార్పు, బిల్లుల సమాచారం, విద్యుత్ అధికారి వివరాలు, విద్యుత్ వినియోగదారుల సమాచారం ఉంటాయని పేర్కొన్నారు. ఐఫోన్ వినియోగిస్తు న్న ఎన్పీడీసీఎల్ కస్టమర్లు ఈ యాప్ సేవల ను వినియోగించుకోవాలని సూచించారు.
జొన్న కొనుగోలు
కేంద్రం ప్రారంభం
మద్నూర్: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో శుక్రవారం జొ న్న కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ వైస్ చైర్మన్ పరమేశ్ పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రంలోనే పంటను విక్రయించి మ ద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ శీను పటేల్, సలాబత్‌పూర్ ఆలయ కమిటీ చైర్మన్ రాంపటేల్, మాజీ ఎంపీపీ ప్రజ్ఞకుమార్, సొసైటీ కార్యదర్శి బాబూరావ్, నాయకులు హన్మండ్లు, స్వామి తదితరులు పాల్గొన్నారు.
రేపు వక్ఫ్ సవరణ బిల్లుకు
వ్యతిరేకంగా నిరసన
బాన్సువాడ రూరల్ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆదివారం రాష్ట్ర రాజధానిలో నిరసన తెలపనున్నట్లు కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఖాలెక్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన బాన్సువాడలో విలేకరులతో మాట్లాడారు. వక్ఫ్ సవరణ బిల్లును ముస్లిం సమాజంపై దాడిగా అభివర్ణించారు. దీనిని నిర సిస్తూ ఆదివారం హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్దగల అంబేడ్కర్ విగ్రహం వద్ద ని ర్వహించే కార్యక్రమానికి ముస్లింలు, ఇతర మైనారిటీలు తరలిరావాలని పిలుపునిచ్చా రు. కార్యక్రమంలో నాయకులు వహాబ్, ఖ మ్రొద్దీన్, రైస్, మన్నాన్, ముఖీద్, గౌస్‌పాషా, ఇలియాస్, సలీమ్, అతీక్ తదితరులు పాల్గొన్నారు.
న్యాయ సేవలపై అవగాహన కలిగి ఉండాలి
న్యాయ సేవలపై అవగాహన కలిగి ఉండాలి


