
వినియోగంలోకి తెస్తే ప్రయోజనం
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని గోలిలింగాల గ్రామశివారులో గల మంజీరనది ఒడ్డున 2010లో అప్పటి ప్రభుత్వ హయాంలో రూ.9 కోట్లతో మంజీర తాగునీటి పథకం పనులను ప్రారంభించారు. పనులు కొనసాగుతున్న తరుణంలోనే అంచనా వ్యయం పెరగడంతో ప్రభుత్వం మరో రూ.4.60కోట్లు మంజూరు చేసింది. 2014లో ఎట్టకేలకు తాగునీటి పథకం పనులు పూర్తయ్యాయి. తాగునీటి పథకం పనులు పూర్తయి తర్వాత కేవలం ట్రయల్‌రన్ మాత్రమే చేశారు. తదనంతర పరిస్థితులతో పథకం వినియోగంలోకి రాకపోగా గత కొన్నేళ్లుగా వృథాగా మిగిలిపోయింది. నాగిరెడ్డిపేట మండలంలోని 30గ్రామాలతోపాటు లింగంపేట మండలంలోని 9గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయాలనే ఉద్దేశంతో ఈతాగునీటి పథకాన్ని నెలకొల్పారు.
ప్రతిపాదనలకే పరిమితమైన మరమ్మతులు
ఈతాగునీటి పథకం మరమ్మతుల కోసం 2019లో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు రూ.18లక్షలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అప్పటి నుంచి ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు మంజూరు కాలేదు. ఫలితంగా కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటుచేసిన తాగునీటి పథకం వృథాగా మిగిలిపోయింది. నదిలోని ఓపెన్‌వెల్ నుంచి ఇంటెక్‌వెల్ వరకు పైపులైన్‌ను సరిచేయడంతోపాటు ఇంటెక్‌వెల్‌లోని పంప్‌సెట్‌లకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన తాగునీటి పథకాన్ని వినియోగంలోకి తీసుకొస్తే కనీసం వేసవికాలంలోనైనా మండలప్రజలకు తాగునీటి సరఫరాలో ప్రయోజనం చేకూరనుంది.
నదిలో నిర్మించిన ఓపెన్‌వెల్
ధ్వంసమైన పైపులైన్లు...
గోలిలింగాల గ్రామశివారులో గల మంజీరనదిలో ఓపెన్‌వెల్‌తోపాటు నది ఒడ్డున ఇంటెక్‌వెల్‌ను నిర్మించారు. అక్కడి నుంచి మండలంలోని మాల్తుమ్మెదగేట్ వద్ద గల గుట్ట వరకు పైపులైన వేసి గుట్టపై ఓవర్ హెడ్ రిజర్వ్(ఓహెచ్‌ఆర్)ట్యాంకును నిర్మింపజేశారు. ఓహెచ్‌ఆర్ ట్యాంకు నుంచి మండలంలోని 30గ్రామాలతోపాటు లింగంపేట మండలంలోని 9గ్రామాలకు తాగునీరు సరఫరా అయ్యేలా ప్రత్యేకంగా పైపులైన్లను వేశారు. దీంతోపాటు మంజీరనది ఒడ్డున నిర్మించిన ఇంటెక్‌వెల్ నుంచి ఓహెచ్‌ఆర్ ట్యాంకుకు నీటిని ఎత్తిపోసేందుకు రెండు 40హెచ్‌పీ మోటార్లను సైతం ఏర్పాటు చేశారు. తాగునీటి పథకం వినియోగానికి అవసరమైన కరెంట్ సరఫరా కోసం ఇంటెక్‌వెల్ వద్ద ప్రత్యేకంగా రెండు ట్రాన్స్‌ఫార్మర్లను సైతం ఏర్పాటు చేశారు.మండలంలోని మాల్తుమ్మెద గేట్ నుంచి లింగంపేట మండలంలోని మెంగారం వరకు చేపట్టిన రోడ్డు పనుల్లో భాగంగా ఓహెచ్‌ఆర్ ట్యాంకు నుంచి ఏర్పాటు చేసిన పైపులైన్లు ధ్వంసమయ్యాయి. ఏళ్ల తరబడి తాగునీటి పథకాన్ని వినియోగంలోకి తీసుకురాకపోవడంతో ఇంటెక్‌వెల్‌లోని మోటార్లు సైతం చెడిపోయాయి.
నిర్వహణ లోపంతో వృథాగా మారిన
గోలిలింగాల తాగునీటి పథకం
కోట్ల రూపాయలు వెచ్చించి
మంజీరతీరాన ఏర్పాటు
వేసవికాలంలో ప్రజలకు
తాగునీటి సరఫరాలో ఎంతో మేలు

వినియోగంలోకి తెస్తే ప్రయోజనం

వినియోగంలోకి తెస్తే ప్రయోజనం

వినియోగంలోకి తెస్తే ప్రయోజనం