ఇంటి ఆవరణలో గంజాయి సాగు
పెద్దకొడప్‌గల్(జుక్కల్): గంజాయి మొక్కలు పెంచుతున్న వారి ఇళ్లపై ఎకై ్సజ్ పోలీసులు శనివారం దాడి చేసి ఒకరిని అరెస్టు చేశారు. ఎకై ్సజ్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కాటేపల్లి తండాలో ఇద్దరు వ్యక్తులు ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు సాగు చేస్తూ అమ్ముతున్నారనే విశ్వసనీయ సమాచారంతో సీఐ సత్యనారాయణ బృందంతో కలిసి తనిఖీ చేపట్టారు. భామన్ మధుసింగ్ ఇంటి ఆవరణలో 16 గంజాయి మొక్కలను కనుగొని వాటిని తొలగించి స్వాధీనం చేసుకోగా, నిందితుడు పరారయ్యాడు. మరో వ్యక్తి బర్ధవాల్ రాయిలా ఇంట్లో తనిఖీ చేయగా 200 గ్రాముల ఎండు గంజాయి లభించింది. ఇద్దరిపై కేసు నమోదు చేసి, బర్ధవాల్ రాయిలాను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. గంజాయి మొక్కలు పెంచినా, విక్రయించినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎకై ్సజ్ పోలీసుల దాడి
ఒకరి అరెస్టు.. పరారీలో మరొకరు


