‘పట్టు పరిశ్రమతో మంచి ఆదాయం’
బీబీపేట : పట్టు పరిశ్రమతో రైతులు మంచి ఆదాయం పొందవచ్చని జిల్లా పట్టుపరిశ్రమ అధికారి అయిలయ్య పేర్కొన్నారు. శనివారం యాడారంలోని రైతు వేదికలో పట్టు పరిశ్రమపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తూ పట్టు పరిశ్రమను ప్రోత్సహిస్తోందన్నారు. తక్కువ శ్రమతో అతి తక్కువ రోజుల్లో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని పేర్కొన్నారు. మల్బరీ సాగువైపు దృష్టి సారించాలని రైతులకు సూచించారు.
15న జిల్లాకు
మంత్రి జూపల్లి రాక
కామారెడ్డి క్రైం: రాష్ట్ర ఎకై ్సజ్, టూరిజం, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈనెల 15 న జిల్లాకు రానున్నారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు కామారెడ్డి కలెక్టరేట్‌లో జరిగే సమావేశంలో ఆయన పాల్గొంటారు. వ్యవసాయ, సివిల్ సప్లయ్, మార్కెటింగ్, వైద్య ఆరోగ్య, నీటి పారుదల తదితర శాఖలకు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షిస్తారని అధికారులు తెలిపారు. అనంతరం ఆర్మూర్‌కు బయలుదేరి వెళ్తారని పేర్కొన్నారు.
ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ
ఎల్లారెడ్డి : ఎస్పీ రాజేశ్ చంద్ర శనివారం ఎల్లారెడ్డి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు డీఎస్పీ శ్రీనివాస్‌రావు, సీఐ రవీందర్‌నాయక్, ఎస్సైలు పూల మొక్కలు ఇచ్చి స్వాగతం పలికారు. పోలీసులు గౌరవవందనం సమర్పించారు. అనంతరం ఎస్పీ పోలీస్‌స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో ప్రవర్తించాల్సిన తీరును సిబ్బందికి వివరించారు. స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. నేరాల నియంత్రణకు పెట్రోలింగ్, గస్తీ నిర్వహించాలని, అనుమానితులను పరిశీలించాలని ఆదేశించారు. పట్టణంలో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు
ఫరీదుపేట వాసి ఎంపిక
మాచారెడ్డి: పాల్వంచ మండలం ఫరీదుపేటకు చెందిన సునీల్‌రెడ్డి అంతర్జాతీయ అథ్లెటిక్స్ పో టీలకు ఎంపికయ్యా రు. ఈ విషయాన్ని గ్రామస్తులు తెలిపారు. ఇటీవల కేరళలో జరిగిన జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలలో 5 కిలోమీటర్ల పరుగు పందెంలో సునీల్‌రెడ్డి సిల్వర్ మెడల్ సాధించారన్నారు. దీంతో ఆయనను అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక చే శార ని పేర్కొన్నారు. త్వరలో శ్రీలంకలో ని ర్వహించే అంతర్జాతీయ పోటీలలో ఆయన పా ల్గొంటారని తెలిపారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రంజిత్ మోహన్, ప్రధాన కార్యదర్శి నరేశ్ అభినందించారు.
డిగ్రీ ప్రాక్టికల్స్ బహిష్కరిస్తాం
● ప్రైవేట్ కాలేజ్ మేనేజ్‌మెంట్
అసోసియేషన్
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 16 నుంచి జరిగే డిగ్రీ ప్రాక్టికల్ పరీక్షలను బహిష్కరిస్తున్నట్లు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల సంఘం ప్రతినిధులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల విషయమై ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న జాప్యంతో ప్రైవేట్ కళాశాలల భవనాల అద్దెలు చెల్లించలేక, లెక్చరర్ల జీతభత్యాలు ఇవ్వలేక యాజమాన్యాల బతుకులు అగమ్యగోచరంగా మారాయన్నారు. ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ డిగ్రీ ప్రాక్టికల్స్ బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు తెయూ రిజిస్ట్రార్, పరీక్షల నియంత్రణాధికారికి లేఖ అందజేసినట్లు పేర్కొన్నారు.
‘పట్టు పరిశ్రమతో మంచి ఆదాయం’
‘పట్టు పరిశ్రమతో మంచి ఆదాయం’


