ప్రోత్సాహం కరువు
మట్టి పాత్రల తయారీకి జుక్కల్ ప్రాంతం ప్రసిద్ధి రంజన్లు, కుండలు, వంట పాత్రల తయారీతో ఉపాధి
విష్ణుమూర్తి సుదర్శన చక్రం తిప్పినట్లుగా కుమ్మరి సారెను గిర్రున తిప్పేస్తారు. బ్రహ్మదేవుడు సృష్టికి ప్రాణం పోసినట్లుగా.. మట్టిముద్దల్ని అలవోకగా కుండలుగా మలిచేస్తారు. చూడచక్కని ఆకృతులలో పాత్రలు తయారు చేస్తారు. మట్టితో కుండలు, పూలతొట్లు, వంట పాత్రలు, దీపెంతలు.. ఇలా రకరకాల వస్తువులు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు కుమ్మరులు. కష్టానికి తగిన ఫలితం లభించనప్పటికీ తరతరాలుగా వస్తున్న కుల వృత్తిని కొనసాగిస్తూ వస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో మట్టి పాత్రల తయారీకి జుక్కల్ ప్రాంతం పెట్టింది పేరు. మూడు రాష్ట్రాల కూడలి, మూడు భాషలు మాట్లాడే ప్రాంతమైన జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్, జు క్కల్, పెద్దకొడప్‌గల్, బిచ్కుంద, పిట్లం తదితర మండలాల్లో కుమ్మరులు ఇప్పటికీ మట్టి కుండలు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. కొందరు కామారెడ్డికి వలస వెళ్లి కుండలు తయారు చేస్తుండ గా, చాలా మంది సొంతూళ్లలోనే ఉంటూ మట్టితో కుండలు, పూలతొట్లు, వంట పాత్రలు, దీపెంతలు తదితర వస్తువులు తయారు చేస్తున్నారు.
వివిధ ప్రాంతాలకు సరఫరా...
జుక్కల్ నియోజకవర్గంలో తయారైన మట్టి పాత్ర లు వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతున్నాయి. కామారెడ్డి జిల్లాతోపాటు నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, సంగారెడ్డి నగరాలు, పొరుగు రాష్ట్రాలలోని నాందేడ్, బీదర్ ప్రాంతాలకూ పంపిస్తున్నారు. రాష్ట్రంలోని చాలా చోట్ల జుక్కల్ ప్రాతానికి చెందిన కుమ్మరులు తయారు చేసిన కుండలు, రంజన్లు, వంట పాత్రలు అమ్ముతారు. మంచి కళానైపుణ్యం ఉండడంతో ఆధునిక డిజైన్లలోనూ చాలా వస్తువులు తయారు చేస్తున్నారు. కొందరు ముందుగా ఆర్డర్
ఇస్తారని, దానికి అనుగుణంగా తయారు చేస్తామని కుమ్మరులు చెబుతున్నారు.
మద్నూర్ మార్కెట్‌లో మట్టి పాత్రలు విక్రయిస్తున్న మహిళ
మట్టి పాత్రల తయారీకి అవసరమైన మట్టి చెరువుల్లో కుమ్మరులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లి తీసుకురావడం వల్ల భారం పడుతోందని వారంటున్నారు. తమ కుల వృత్తికి సంబంధించిన ఆధునిక పరికరాలు ఎన్నో వచ్చినా వాటిని కొనుగోలు చేసే ఆర్థిక శక్తి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకుని, సబ్సిడీపై ఆయా పరికరాలను అందించాలని కోరుతున్నారు.
ప్రోత్సాహం కరువు
ప్రోత్సాహం కరువు
ప్రోత్సాహం కరువు
ప్రోత్సాహం కరువు


