కనుల పండువగా రథోత్సవం
రథోత్సవంలో పాల్గొన్న భక్తులు
రామారెడ్డి: మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి, రాజరాజేశ్వరస్వామి ఆలయాల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం రథోత్సవం నిర్వహించారు. రథాల గైని నుంచి సబ్ స్టేషన్ వరకు కార్యక్రమం కనుల పండువగా సాగింది. రథోత్సవం అనంతరం సీతారామచంద్రస్వామి, రాజరాజేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఆలయానికి తీసుకొచ్చారు. రాత్రి చక్రతీర్థం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రంగు రవీందర్ గౌడ్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గాండ్ల సాయిలు, ఉపాధ్యక్షుడు శంకర్ గౌడ్, విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.


