ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఉమ్మడి నిజామాబా ద్ జిల్లాకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టుల పనులపై ఆదివారం హైదరాబాద్‌లోని జలసౌధలో సమీక్ష సమావేశం ని ర్వహించారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు ష బ్బీర్‌అలీ, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే లు లక్ష్మీకాంతారావు, భూపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రాణహిత –చేవెళ్ల ప్రాజెక్టులో 22వ ప్యాకేజీ కింద చేపట్టాల్సిన పనులు, భూ సేకరణకు నిధులు ఇవ్వాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ కోరారు. ఖరీఫ్ సీజన్‌కు నీ రందించేందుకోసం వేగంగా పనులు పూర్తి చే యాలన్నారు. నాగమడుగు రబ్బర్‌డ్యాం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. లెండి ప్రాజెక్టుకు సంబంధించి చర్చించారు. అంతర్రాష్ట్ర ఒప్పందాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. సింగితం ప్రా జెక్టు వద్ద దెబ్బతిన్న లైనింగ్ పనులను వెంటనే చేపట్టాలని సమావేశంలో అధికారులను ఆదే శించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు సమీపంలో 12ఎకరాలలో ఎకో టూరిజాన్ని అభివృద్ధి చే యడంపైనా సమావేశంలో చర్చించారు.
కాళేశ్వరం 21, 22 ప్యాకేజీలతో పాటు మిగతా ప్రాజెక్టులపైనా చర్చ
సమీక్షించిన మంత్రులు ఉత్తమ్, జూపల్లి కృష్ణారావు
పాల్గొన్న ఎంపీ షెట్కార్, ప్రభుత్వ
సలహాదారు షబ్బీర్, ఎమ్మెల్యేలు


