రాజీవ్ యువ వికాసానికి ఆన్‌లైన్ అవస్థలు
బిచ్కుంద(జుక్కల్) : నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం ఆశావాహుల్లో ఆందోళన కనిపిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలకు మూడు రోజులు సెలవులు రావడంతో కుల, ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందలేదు. వీటితో పాటు మీసేవాలో దరఖాస్తులు చేసుకుంటున్న యువతకు ఆన్‌లైన్ అవస్ధలు, సర్వర్ బిజీతో సైట్ ఓపెన్ కావడం లేదు. అందరు ఒకేసారి దరఖాస్తులు చేసుకోవడం సర్వర్ బిజీతో మీసేవా వద్ద దరఖాస్తుదారులు పడిగాపులు కాస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ సమస్యనే ఎదుర్కొంటున్నారు. దరఖాస్తు కోసం సోమవారం ఆఖరు. శని, ఆది సెలవులు రావడంతో తహసీల్ కార్యాలయాలు మూసి ఉన్నాయి. కొందరికి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు అందక దరఖాస్తులు చేసుకోలేకపోతున్నారు. ప్రభుత్వం గడువు పెంచి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దరఖాస్తు చేసుకునే విధంగా మరోసారి అవకాశం కల్పించాలని నిరుద్యోగ యువత కోరుతున్నారు.
నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు
వరుసగా సెలవులు
అందని ధ్రువీకరణ పత్రాలు


