రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు
గాంధారి(ఎల్లారెడ్డి): గాంధారి–బాన్సువాడ ప్రధాన రహదారిపై గుంతలతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సదాశివనగర్ మండలం ధర్మరావుపేట్‌కు చెందిన ఓ వ్యక్తి కుటుంబంతో పోతంగల్‌కు బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో తిమ్మాపూర్ స్టేజీ వద్ద గుంతల రోడ్డులో మహిళ బైక్ పై నుంచి ఎగిరి కిందపడింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. తిమ్మాపూర్ గ్రామస్తులు వెంటనే మహిళను కారులో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంబంధిత అధికారులు మరమ్మతుల పేరుతో ప్లొకెయిన్‌తో గుంతలను తవ్వి వదిలేశారు. వాహనదారులు గమనించకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
ప్రమాదాలు జరుగుతున్నా..
పట్టించుకోని అధికారులు
రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు


