ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మనదే
తెయూ(డిచ్‌పల్లి): బీఆర్ అంబేడ్కర్ భారతదేశాన్ని కేవలం రాజకీయంగా కాకుండా ప్రజాస్వామ్యంగా మార్చాలనే లక్ష్యంతో ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం రూపొందించారని తెలంగాణ యూనివర్సిటీ వీసీ యాదగిరిరావు అన్నారు. మహనీయుల జయంతి ఉత్సవాలలో భాగంగా ఆదివారం తెయూ ఎస్సీ సెల్ డైరెక్టర్ వాణి నేతృత్వంలో ‘21వ శతాబ్దంలో అంబేడ్కర్ ఆలోచనల ఔచిత్యం’ అనే అంశంపై వెబినార్ నిర్వహించారు. ఈసందర్భంగా వీసీ మాట్లాడుతూ.. వర్తమాన సమాజంలో భారతదేశానికి అంబేడ్కర్ ఆలోచనలు అనుసరనీయమన్నారు. తెయూ రిజి
స్ట్రార్ యాదగిరి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగాన్ని, అంబేడ్కర్‌ను వేరువేరుగా చూడలేమన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుకుమార్ మాట్లాడుతూ.. ఆధునిక భారతదేశంలో రాజ్యాంగం ప్రాముఖ్యత గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నాగరాజు, కేఆర్‌ఈఏ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాంబయ్య మాట్లాడారు. ప్రిన్సిపాల్ మామిడాల ప్రవీణ్, డీన్‌లు ఘంటాచంద్రశేఖర్, రాంబాబు గోపిశెట్టి, పీఆర్‌వో పున్నయ్య, అధ్యాపకులు నాగరాజు, జెట్లింగ్ ఎల్లోసా, ప్రసన్నరాణి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
కలప లారీ బోల్తా
నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని మాగి గ్రామ శివారులో ఆదివారం కలప లారీ బోల్తాపడింది. పిట్లం వైపు నుంచి నిజాంసాగర్ వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. ప్రమాదంలో డ్రైవర్‌కు ఎటువంటి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు.
ముళ్ల కంచే
స్కూల్‌కు గేటు
బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలోని గణేశ్ మందిర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గేటు పూర్తిగా విరిగిపోయింది. ఉపాధ్యాయులు గేటుకు ముళ్లకంచె కట్టి దారి మూసివేశారు. ప్రభుత్వం ఈపాఠశాలకు లక్షల నిధులు మంజూరు చేసింది. అదనపు గదులు ఇతర మరమ్మతులు చేయించినా, అధికారులు, ఉపాధ్యాయులు మాత్రం గేటు మరమ్మతులు చేయించలేదు.కొందరు వ్యక్తులు పాఠశాల ఆవరణలో మూత్ర విసర్జన చేస్తున్నారు. దారి మూసివేయడంతో విద్యార్థులు హైస్కూల్ గేటు నుంచి రాకపోకలు చేస్తున్నారు. ఇకనైన అధికారులు స్పందించి కొత్తగా గేటు బిగించాలని విద్యార్థులు కోరుతున్నారు.
ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మనదే
ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మనదే


