టర్బయిన్ల ఆధునికీకరణ పనుల్లో జాప్యం
నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్ ప్రాజెక్టు జల విద్యుదుత్పత్తి కేంద్రం టర్బయిన్ల ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. విద్యుదుత్పత్తి చేయడానినికి మరింత ఆలస్యం కానుంది . ఈటర్బయిన్ల మరమ్మతుకు 2020 సంవత్సరంలో రూ. 12 కోట్లు మంజూరు అయ్యాయి. నిజాంసాగర్ ప్రాజెక్టుకు అనుసంధానంగా హెడ్‌స్లూయిస్ వద్ద 15 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి సామర్థ్యంతో జల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని 1954 ఏర్పాటు చేశారు. హైడ్రో ఎలక్ట్రిక్ జనరేషన్ కింద మూడు టర్బయిన్లు ఏర్పాటు చేశారు. మూడో టర్బయిన్ 1974లో చెడిపోయి మూలనపడింది. సదరు టర్బయిన్ మూలన పడి 50 ఏళ్లు గడిచినా ఇంత వరకు మరమ్మతుకు నోచుకోవడం లేదు. జలవిద్యుదుత్పత్తి చేపడుతున్న రెండు టర్బయిన్లు సాంకేతిక సమస్యలు ఉత్పన్నం అవుతుండటంతో మరమ్మతులకు అనుమతించారు. రెండో టర్బయిన్ మరమ్మతులు ప్రారంభించారు. సదరు టర్బయిన్‌లో పరికరాలు పూర్తిగా దెబ్బతినడంతో అనుకున్నంతగా పనులు ముందుకు సాగడం లేదు.జలవిద్యుదుత్పత్తి కేంద్రం ఆధునికీకరణతో పాటు టర్బయిన్లకు పూర్తి మరమ్మతు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దాంతో ప్రభుత్వం రూ. 12 కోట్లు మంజూరు చేసినా పనులు అసంపూర్తిగా ఉన్నాయి. టర్బయిన్ల మరమ్మతులు ఆలస్యం అవుతుండటంతో జలవిద్యుద్పుత్తి నష్టపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు స్పందించి వేసవిలో పనులు త్వరగా పూర్తి చేస్తే వానకాలంలో జలవిద్యుదుత్పత్తి ప్రారంభించవచ్చు.
హెడ్‌స్లూయిస్ జల విద్యుద్పుత్తి కేంద్రం
నిజాంసాగర్ ప్రాజెక్టు జలవిద్యుదుత్పత్తి కేంద్రంలో తలెత్తిన సాంకేతిక సమస్యలు
మూడోటర్బయిన్‌కు యాభై ఏళ్లుగా
మరమ్మతులు కరువు
దెబ్బతిన్న పరికరాలకు నిధులు
మంజూరైనా ముందుకు సాగని పనులు
రూ. కోటి మంజూరుకు ప్రతిపాదనలు
జల విద్యుద్పుత్తి కేంద్రం మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. రెండవ టర్బయిన్ అనుకున్న దానికన్నా ఎక్కువగా మరమ్మతులు చేపట్టాల్సిన పరిస్థితి ఉంది. ప్యానల్ బోర్డు, ఎలక్ట్రికల్ పరికరాలు, వైరింగ్, టర్బయిన్ మరమ్మతులకు నిధులు ఏమాత్రం సరిపోవడం లేదు. రూ.కోటి మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదించాం.
– రవికుమార్, ఏడీ, సివిల్ ఆర్‌అండ్‌ఎం
టర్బయిన్ల ఆధునికీకరణ పనుల్లో జాప్యం
టర్బయిన్ల ఆధునికీకరణ పనుల్లో జాప్యం


