విస్త ృతంగా ప్రచారం చేయాలి
కామారెడ్డి క్రైం : భూ భారతి పోర్టల్‌పై విస్తృతంగా ప్రచారం చేయాలని,, రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. మంగళవారం సాయంత్రం భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లు, తాగునీరు, రేషన్ కార్డుల వెరిఫికేషన్, భూగర్భ జలాల పెంపు అంశాలపై ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీవోలు, మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతిపై అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించాలని, ఒక్కో సదస్సుకు కనీసం 200 మంది రైతులు హాజరయ్యేలా చూడాలని సూచించారు. సదస్సు ఏర్పాట్ల కోసం ప్రతి మండలానికి రూ.10 వేలు కేటాయించామన్నారు. రోజుకు రెండు మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ప్రస్తుతం ధరణి పోర్టల్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. బుధవారంలోగా లబ్ధిదారుల జాబితాలను ఇందిరమ్మ కమిటీలకు ఇస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్ పాల్గొన్నారు.


