
ప్రతి ఇంటి నుంచి తరలిరావాలి
బాన్సువాడ : బీఆర్‌ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు అవు తున్న నేపథ్యంలో వరంగల్‌లో నిర్వహించే రజతోత్సవ సభకు ప్రతి ఇంటి నుంచి తరలిరావాలని ఎ మ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. మంగళవారం బా న్సువాడలో బీఆర్‌ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొనడానికి ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ నుంచి బాన్సువాడకు వచ్చారు. ఆమెకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలి కాయి. ఈ సందర్భంగా తాడ్కోల్ బస్టాండ్ నుంచి భారత్ గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంత రం నిర్వహించిన సమావేశంలో కవిత మాట్లాడా రు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎవరో పెట్టిన భిక్ష కా దన్నారు. కేసీఆర్ త్యాగాలు, పోరాటాల వల్లే ప్రత్యే క రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. తెలంగాణ రాష్ట్రా న్ని పదేళ్లలో ఎంతో అభివృద్ధి చేశారన్నారు. త్వరలో బాన్సువాడలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. అధికారం కోసం పార్టీ మారిన పోచా రం శ్రీనివాస్‌రెడ్డికి ఉప ఎన్నికలలో ఘోర పరాజ యం తప్పదన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా బాన్సువాడ ని యోజకవర్గానికే నిధులు కేటాయించారని మాజీ ఎ మ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. ఈ ప్రభా వం మిగతా నియోజకవర్గాలపై పడిందని, పోచా రం వల్లే బీఆర్‌ఎస్ ఓటమి పాలయ్యిందని విమర్శించారు. కార్యక్రమంలో నస్రుల్లాబాద్ మండలం సంగెం గ్రామానికి చెందిన మణియమ్మ అనే మహి ళ తన కూతురుకు వచ్చిన కల్యాణ లక్ష్మి డబ్బుల నుంచి రూ. 2 వేలను పార్టీ కోసం ఎమ్మెల్సీ కవితకు అందించారు. బాన్సువాడ పట్టణానికి చెందిన పలువురు కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరారు.
రజతోత్సవ సభను
విజయవంతం చేయాలి
ఎమ్మెల్సీ కవిత పిలుపు
ఇవిగో కేసీఆర్ ఆనవాళ్లు..
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సస్యశ్యామలంగా తీర్చిదిద్దారని చెప్పడానికి చెక్‌డ్యామే సాక్ష్యమని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో బాన్సువాడ చింతల్‌నాగారం శివారులోని మంజీర నదిపై నిర్మించిన చెక్ డ్యాంను ఆమె సందర్శించారు. మండు వేసవిలోనూ మత్తడి దూకుతుండడాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఇలాంటి చెక్‌డ్యాంలు నాలుగు నిర్మించారని, ఒక్కో చెక్ డ్యాం కింద 1,600 ఎకరాలలో రెండు పంటలు పండుతున్నాయని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, కార్యకర్తలతో కలిసి కవిత సెల్ఫీ దిగారు.

ప్రతి ఇంటి నుంచి తరలిరావాలి