అర్ధంతరంగా నిలిచిన ‘అంగన్‌వాడీ’
నస్రుల్లాబాద్(బాన్సువాడ): మండలంలోని రాములగుట్ట తండాలో నూతనంగా నిర్మిస్తున్న అంగన్‌వాడీ భవన నిర్మాణ పనులు అర్ధంతరంగా నిలిచి పోయాయి. గతంలో రూ.9లక్షల నిధులు కేటాయించి భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. పనులు మొదలుపెట్టి ఏళ్లు గడుస్తున్నా పనులు పూర్తికావడం లేదు. అసంపూర్తి పనుల కారణంగా భవనం మందుబాబులకు అడ్డాగా మారింది. భవనం అందుబాటులోకి రాకపోవడంతో చిన్నారులు అద్దె భవనంలో ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
అర్ధంతరంగా నిలిచిన ‘అంగన్‌వాడీ’


