వాల్ పోస్టర్ల ఆవిష్కరణ
కామారెడ్డి టౌన్: గ్రామీణ ప్రాంతంలోని మహిళల సురక్షితమైన ఆరోగ్యం కోసం ఏబీవీపీ ఆధ్వర్యంలో రుతుమర్తి అభియాన్ కార్యక్రమాన్ని రూపొందించినట్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ప్రత్యూష రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మంగళవారం కార్యక్రమ వాల్ పోస్టర్లను వారు ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలను చైతన్యపరుస్తామన్నారు. ప్రిన్సిపల్ విజయ్‌కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు.


