పైప్‌లైన్ల లీకేజీ.. తాగునీరు వృథా
బాన్సువాడ రూరల్: మిషన్ భగీరథ పథకం నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా తాగునీరు వృథా అవుతోంది. మండలంలోని ఎక్కడో ఓచోట ప్రతిరోజు పైప్‌లైన్‌లు లీకేజీకి గురికావడంతో నీరు కలుషితమవుతున్నాయి. పైప్‌లైన్ లీకేజీలను సరిచేయించాల్సిన అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో ప్రజలకు కలుషిత నీరే సరఫరా అవుతోంది. దీంతో ప్రజలు మినరల్ వాటర్ క్యాన్లలో నీటిని కొనితెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి పైప్‌లైన్ లీకేజీలను పూడ్చి స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.


