కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రధాని దిష్టి బొమ్మ దహనం
కామారెడ్డి టౌన్ : నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంఽధీలపై కేంద్ర ప్రభుత్వం అనుచితమైన కేసులు నమోదు చేశాయని ఆరోపిస్తూ బుధవారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ ప్రజా సమస్యల పైన మోడీని నిలదీస్తున్నందున కక్ష పూరితంగా అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్, యువజన అధ్యక్షుడు శ్రీనివాస్, ఓబీసీ సెల్ చైర్మన్ శ్రీనివాస్, నాయకులు రాజాగౌడ్, బ్రహ్మానందరెడ్డి, పంపర లక్ష్మణ్, చాట్ల రాజేశ్వర్, శివకుమార్,నర్సింలు, అంజాద్, బట్టు మోహన్, తేజపు ప్రసాద్,ఎల్.గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.


