వేసవి సెలవుల్లో అప్రమత్తంగా ఉండాలి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): వేసవి సెలవుల్లో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై మల్లారెడ్డి తెలిపారు. నాగిరెడ్డిపేట కస్తూర్భా పాఠశాలలో బుధవారం షీ టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి సెలవుల్లో ఇంటికి వెళ్లినప్పుడు అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలన్నారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ఆయన చెప్పారు. చెరువులకు ఈతకు వెళ్లకూడదన్నారు. పాఠశాల స్పెషల్ ఆఫీసర్ గీతతోపాటు షీ టీం బృందం సభ్యులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
సైబర్ నేరగాళ్ల నుంచి
అప్రమత్తంగా ఉండాలి
నస్రుల్లాబాద్(బాన్సువాడ) : సైబర్ నేరగాళ్ల నుంచి అప్రమత్తంగా ఉండాలని ఏఎస్సై అబీద్ బేగ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని సంతలో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల కోతలు ముగిసి డబ్బులు ఖాతాల్లో వచ్చే సమయమని, తమ బ్యాంక్ ఖాతా వివరాలను తెలియజేయవద్దని సూచించారు.ఆయన వెంట సిబ్బంది ఉన్నారు.
పోగొట్టుకున్న సెల్ ఫోన్ అప్పగింత
మాచారెడ్డి: పోగొట్టుకున్న సెల్ ఫోన్‌ను బుధవారం బాధితునికి అప్పగించినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. పాల్వంచ మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన కామటి నర్సింలు పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి అందజేసినట్లు వివరించారు.


