ఉద్యానవన పంటలతో రైతులకు లాభాలు
తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఉపాధిహామీ పథకంలో ఉద్యానవన పంటలను పెంచుకునే అవకాశముందని, ఉద్యానవన పంటలు రైతులకు ఎంతో లాభదాయకమని డీఆర్‌డీవో సురేందర్ అన్నారు. ఆయన బుధవారం తాడ్వాయి శివారులో ఉద్యానవన పంటలో భాగంగా వేసిన మునగ పంట పెంపకంను పరిశీలించారు. మొక్కల పెంకం, మునక్కాయల దిగుబడిని రైతును అడిగి తెలుసుకున్నారు. ఎకరానికి సుమారు వేయి మొక్కల చొప్పున రెండు ఎకరాలలో రెండువేల మొక్కలను నాటామని, క్వింటాల్ మునగ కాయకు మార్కెట్లో రూ. 2వేలు వస్తాయని రైతు సమధానం ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 400ఎకరాలలో ఉద్యానవన పంటలను పెంచుకునేందుకు అవకాశముందని, ఆసక్తిగల రైతులు ముందుకు రావాలన్నారు. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి పొందే అవకాశముందని తెలిపారు. అనంతరం మండలపరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డు అసిస్టెంటులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి గ్రామంలో కూలీల సంఖ్యను పెంచాలని, కూలీరేటు రూ.307వచ్చేలా చూడాలన్నారు. పండ్ల తోటల పెంపకం నిమిత్తం ప్రతిగ్రామం నుంచి ఒకరి నుంచి ఐదుగురి లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సయ్యద్ సాజీద్‌అలీ, ఎంపీవో సవితారెడ్డి, ఏపీవో కృష్ణగౌడ్, టెక్నికల్ అసిస్టెంట్లు స్వామి, మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి
డీఆర్‌డీవో సురేందర్


