పేదల కడుపు నింపేందుకే సన్నబియ్యం
పెర్కిట్(ఆర్మూర్): పేద, సామాన్య ప్రజల కడుపు నింపేందుకే రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేపట్టిందని రాష్ట్ర పర్యాటక, ఎకై ్సజ్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి రేషన్ లబ్ధిదారుడు లక్కారం తవ్వన్న ఇంట్లో సన్నబియ్యంతో మంత్రి బుధవారం భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పంపిణీ చేసిన దొడ్డు బియ్యాన్ని తినేందుకు లబ్ధిదారులు విముఖత చూపుతూ ఇతరులకు విక్రయించి మార్కెట్‌లో సన్న బియ్యం కొనుగోలు చేసుకునే వారన్నారు. ప్రభుత్వానికి భారమైనా పేదలకోసం సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
లబ్ధిదారు ఇంట్లో భోజనం చేస్తున్న
మంత్రి జూపల్లి కృష్ణారావు


