
అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి
మాచారెడ్డి : అర్హులను ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో ఎంపిక చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మాచారెడ్డి, పాల్వంచ మండల కేంద్రాల్లో గురువారం ఆయా మండలాల పంచాయతీ కార్యదర్శులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు పేద కుటుంబాలను ఎంపిక చేసే విధంగా ఇందిరమ్మ కమిటీ సభ్యులు చొరవ తీసుకోవాలన్నారు. అర్హుల జాబితాలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఎంపిక ప్రక్రియ జరగాలన్నారు. గ్రామ పంచాయతీల వారీగా సర్వే నిర్వహించి జాబితా తయారు చేయాలన్నారు. అనంతరం మాచారెడ్డిలో కొనసాగుతున్న మోడల్ ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. ఆయన వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్‌నాయక్, మండల ప్రత్యేకాధికారి సురేశ్, జిల్లా పంచాయతీ అధికారి మురళి, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.