తప్పుడు పత్రాలతో కొలువులు!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సినవారే.. ఉద్యోగం కోసం త ప్పుదారిన వెళ్లారు. దివ్యాంగుల కోటా కోసం తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించారు. అయితే ఈ విషయం నిర్ధారణ కావడంతో ఉ ద్యోగాల నుంచి ఎందుకు తొలగించకూడదంటూ జిల్లా విద్యాశాఖ అధికారి షోకాజ్ నోటీసు లు జారీ చేశారు. దీనిపై సదరు టీచర్లు కోర్టుకు వెళ్లగా.. విద్యాశాఖ కౌంటర్ దాఖలు చేసింది.
డీఎస్సీ–2024లో విజువల్ హ్యాండీకాప్డ్ (దృష్టిలోపం) కోటాలో వివిధ సబ్జెక్టుల్లో 17 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారు. అయితే 11 మంది మాత్రమే ఎంపికయ్యారు. అందరూ సదరం సర్టిఫికెట్లను చూపి రిజర్వేషన్ కోటాలో ఉద్యోగాలు పొందారు. తర్వాత రాష్ట్ర విద్యా శాఖ డైరెక్టరేట్ ఆదేశాల మేరకు 11 మందిని సరోజినిదేవీ కంటి ఆస్పత్రికి పరీక్షల నిమిత్తం పంపించారు. అక్కడి వైద్యులు పరీక్షించి ఆరుగురికి 40 శాతానికిపైగా దృష్టి లోపం ఉందని, మిగతా ఐదుగురు 40 శాతంలోపు దృష్టి దోషంతో ఉన్నారని నిర్దారించారు. నిబంధనల ప్రకా రం 40 శాతానికిపైగా దృష్టి లోపం ఉంటేనే రిజర్వేషన్‌కు అర్హులు. సదరం సర్టిఫికెట్లలో దృష్టిలోపం ఎక్కువగా ఉండగా, సరోజినీ దేవి కంటి ఆస్పత్రి వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో తక్కు వ ఉన్నట్లు తేలింది. ఐదుగురిలో ఇద్దరికి పది శాతం, ముగ్గురికి 30 శాతం మాత్రమే ఉన్నట్లు నిర్ధారణ కావడంతో వారికి విజువల్ హ్యాండీ కాప్డ్ (దృష్టిలోపం) రిజర్వేషన్ కోటా వర్తించదని విద్యాశాఖ అధికారులు తేల్చారు.
చర్యలు తీసుకునే అధికారం ఉంది
ఉద్యోగంలో చేరిన సమయంలో తప్పుడు ప త్రాలు సమర్పిస్తే చర్యలు తీసుకునే అధికారం ఉంది. 40శాతంకన్నా ఎక్కువ దృష్టి లో పం ఉన్నట్లు వారు సదరం సర్టి ఫికెట్లు ఇచ్చారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా దృష్టిలోపం, చెవుడు వంటి వాటికి సంబంధించిన కోటాలో ఉద్యోగాలు పొందిన వారిని ప్రభుత్వాస్పత్రుల్లో పరీక్షలు జరిపించగా.. జిల్లాకు చెందిన ఐదుగురికి తక్కువ దృష్టిలోపం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అందుకే వారికి నోటీసులు ఇచ్చాం. వారు కోర్టును ఆశ్రయించగా.. మేం కౌంటర్ దాఖలు చేశాం. కోర్టు ఆదేశాలు వచ్చాక చర్యలు తీసుకుంటాం.
–రాజు, జిల్లా విద్యాశాఖ అధికారి, కామారెడ్డి
ఆ ఐదుగురికి...
నిబంధనల ప్రకారం రిజర్వేషన్ పొందడానికి అర్హత లేనందున ఎందుకు చర్య లు తీసుకోకూడదంటూ జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.రాజు ఫిబ్రవరి 28న షోకా జ్ నోటీసులు జారీ చేశారు. నోటీసులకు వారు ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదంటూ వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని నిర్ణయించారు. అయితే తాము సదరం సర్టిఫికెట్ల ఆధారంగానే ఉద్యోగాలకు ఎంపికయ్యామని, తమదెలాంటి తప్పిదం లేదని ఆ ఉపాధ్యాయు లు కోర్టును ఆశ్రయించారు. దీంతో వి ద్యా శాఖ అధికారులకు కోర్టు నుంచి నో టీసులు వచ్చాయి. దీనిపై విద్యాశాఖ అ ధికారులు కౌంటర్ దాఖలు చేశారు. సరోజినీ దేవి ఆస్పత్రి వైద్యులు చేసిన పరీక్షల రిపోర్టులను న్యాయస్థానం ముందుంచారు. దీనిపై విచారణ జరగాల్సి ఉంది.
దృష్టిలోపం కోటాలో ఉద్యోగాలు
లోపం 40 శాతంలోపే
ఉన్నట్లు నిర్ధారణ
ఐదుగురిని అనర్హులుగా
గుర్తిస్తూ విద్యాశాఖ నోటీసులు
కోర్టుకు వెళ్లిన సదరు ఉపాధ్యాయులు..
కౌంటర్ దాఖలు చేసిన విద్యాశాఖ అధికారులు


