వరిధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం నజర్
నిజాంసాగర్(జుక్కల్): కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. యాసంగి సీజన్‌లో సన్నరకం క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ చెల్లిస్తుండటంతో విక్రయాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేస్తోంది. శనివారం గోర్గల్ గ్రామ కొనుగోలు కేంద్రంలో వరిధాన్యం విక్రయాలను రాష్ట్ర ఎన్‌న్‌ఫోర్స్‌మెంట్ టీం–3 ఓఎస్డీ శ్రీధర్‌రెడ్డి నేతృత్వంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఓఎస్డీ వెంట డీఎస్పీ శేఖర్‌రెడ్డి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీలు సురేశ్, సీఐ, ఎస్సైలు, అచ్చంపేట సొసైటీ సీఈవో సంగమేశ్వర్‌గౌడ్ తదితరులు ఉన్నారు.
కొనుగోలు కేంద్రం పరిశీలన
ఎల్లారెడ్డిరూరల్: మాచాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏపీఎం ప్రసన్నరాణి శనివారం పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, విద్యుత్, త్రాగునీరు, టెంట్ సౌకర్యాలు కొనుగోలు పూర్తయ్యే వరకు ఉంచాలని అన్నారు.
తడిసిన ధాన్యం తరలింపు
రామారెడ్డి: కన్నాపూర్‌లో గురువారం కురిసిన వడగండ్ల వానకు ధాన్యం కొనుగోలు కేంద్రంలోని 1100 సంచుల ధాన్యం తడిశాయి. వెంటనే విషయం తెలుసుకున్న సొసైటీ చైర్మన్ మర్రి సదాశివ రెడ్డి సివిల్ సప్లయ్స్ అధికారులతో మాట్లాడి తడిసిన ధాన్యం కాంటా చేసి రైస్‌మిల్‌కు తరలించారు. వైస్ చైర్మన్ అమ్ముల పశుపతి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు లక్ష్మా గౌడ్, సీఈవో బైరయ్య, తదితరులు పాల్గొన్నారు.


