‘అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి’
ఎల్లారెడ్డిరూరల్: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని, టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచుకోవాలని డీఆర్‌డీవో సురేందర్, ఐకేపీ సిబ్బందికి సూచించారు. ఎల్లారెడ్డి ఐకేపీ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మహిళా సంఘాల ద్వారా 183 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటి ద్వారా ఇంత వరకు 9వేల 927 మెట్రిక్ టన్నుల ధాన్యం 867 మంది రైతుల నుంచి కొనుగోలు చేశామని అన్నారు. రైతులకు ఇంత వరకు 13 కోట్ల 46 లక్షల రూపాయలు వారి ఖాతాలలో ధాన్యం డబ్బులను వేసినట్లు తెలిపారు. ఏపీఎం ప్రసన్నరాణి తదితరులున్నారు.
బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తి అరెస్ట్
మాచారెడ్డి: మేన మామను బ్లాక్ మెయిల్ చేస్తూ రూ. 40 లక్షలు డిమాండ్ చేసిన మేనల్లుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. పాల్వంచ మండలం ఫరీదుపేట గ్రామానికి చెందిన జీడిపల్లి నరసింహారెడ్డి ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్లాట్లు చేసి షట్టర్లను నిర్మించాడని తన మేనల్లుడు ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన గురిజాల మధుసూదన్‌రెడ్డి సోషల్ మీడియాతోపాటు పత్రికల్లో(సాక్షి కాదు) దుష్ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నావని మధుసూదన్‌రెడ్డిని అడిగిన నరసింహారెడ్డిని చంపుతానని బెదిరించి, తప్పుడు ప్రచారం చేయకుండా ఉండాలంటే రూ.40 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు మధుసూదన్‌రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.
చోరీ కేసులో నిందితుడి అరెస్టు
కామారెడ్డి క్రైం: పిట్లం మండల కేంద్రంలో ఇటీవల జరిగిన ఓ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఎ స్పీ రాజేష్ చంద్ర శనివారం సాయంత్రం కేసుకు సంబంధించిన వివరాలను ఒక ప్రకటనలో వెల్లడించారు.ఈ నెల 7న రాత్రి పిట్లం మండల కేంద్రంలో ని నరసింహ జువెలరీ దుకాణంలో చోరీ జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు..సాంకేతిక పరిజ్ఞా నం ఆధారంగా నిందితుడిని మద్నూర్‌కు చెందిన ఉ ప్పల్‌వారి శ్రీనివాస్‌గా గుర్తించారు.నిందితుడిని శనివారం అదుపులోకి తీసుకొని విచారించగా,నేరం అంగీకరించడంతో రిమాండ్‌కు తరలించారు. నిందితుడి నుంచి 22 గ్రాముల బంగారం,9.732 కి లోల వెండిని రికవరీ చేశామని ఎస్పీ తెలిపారు. కేసు ఛేదనలో కృషి చేసిన బాన్సువాడ సీఐ రాజేశ్, పి ట్లం ఎస్సై రాజు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.


