
సిరులు ఒడిసిపట్టు!
బీబీపేట: పట్టు పురుగుల పెంపకం (మల్బరీ సా గు) సిరులు కురిపిస్తోంది. ఒక్కసారి మల్బరీ మొ క్కలు నాటితే ఏకంగా 30 ఏళ్ల పాటు ఆదాయం వ చ్చే అవకాశాలుంటాయి. తక్కువ పెట్టుబడితో ఎ క్కువ ఆదాయం వస్తుండడంతో ఈ పంట సాగుకు జిల్లా రైతులు ఆసక్తి చూపుతున్నారు.
జిల్లాలో 27 ఎకరాల్లో..
జిల్లావ్యాప్తంగా 27 ఎకరాల విస్తీర్ణంలో మల్బరీ సా గవుతోంది. మరో 40 ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెంచేందుకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. రైతులకు పంట విధానంతోపాటు మార్కెటింగ్, కేంద్ర ప్రభుత్వ అందించే రాయితీల గురించి వివరిస్తు న్నారు. బహు వార్షిక పంటైన మల్బరీ మొక్క ఒక సారి నాటితే 30 ఏళ్ల వరకు పంట ఇస్తుంది. మొద టి సంవత్సరం 2 నుంచి 3 పంటలు రాగా రెండో సంవత్సరం నుంచి 7 లేదా 8 పంటలు వస్తాయి.
సాగు చేయడం ఇలా..
కనీసం రెండు ఎకరాల విస్తీర్ణంలో మల్బరీ సాగు చే యాలి. తోట పరిసర ప్రాంతంలో 20 ఫీట్ల అడ్డం, 50 ఫీట్ల పొడవు సీడ్స్ షెడ్డును ఏర్పాటు చేయాలి. షెడ్డు నిర్మాణం పరికరాలకు సిల్క్ సమగ్ర పథకం–2లో భాగంగా కేంద్రం రాయితీని అందజేస్తోంది. రెండు ఎకరాల్లో పట్టు పురుగులను పెంచేందుకు మల్బరీ మొక్కలు నాటి 250 గుడ్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది. గుడ్ల నుంచి బయటికి వచ్చిన పురుగులకు ఆకు కోసి వేయాల్సి ఉంటుంది. ఏర్పాటు చేసుకున్న షెడ్డులో చల్లటి వాతావరణం ఉండేలా చూసుకోవాలి. 20 నుంచి 25 రోజుల్లో పురుగులు గూళ్లను అల్లుకుంటాయి. చంద్రికల నుంచి పట్టుగూళ్లను వే రు చేసి మార్కెట్‌కు తరలించుకోవచ్చు. ఇలా మల్బ రీ సాగులో సరైన యాజమాన్య పద్ధతులు అమలు చేస్తే స్థిరమైన అధిక ఆదాయాన్ని రైతులు సొంతం చేసుకోవచ్చు. నీటి సౌకర్యం కలిగిన నల్లరేగడి, చౌడు మినహా అన్ని భూములు మల్బరీ సాగుకు అనుకూలమని అధికారులు చెబుతున్నారు.
పట్టు పరిశ్రమతో అధికాదాయం..
పట్టు పరిశ్రమపై జిల్లావ్యాప్తంగా రైతులకు అవగాహ న కల్పిస్తున్నాం. రైతులు నే రుగా మమ్మల్ని సంప్రదించి నా వివరాలు చెబుతాం. ప్ర భుత్వం అందించే రాయితీ ని ఉపయోగించుకొని పట్టు పరిశ్రమలు నెలకొల్పా లి. పట్టు సాగుతో అధిక ఆదాయం పొందవచ్చు.
– జ్యోతి, జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి
మల్బరీ మొక్కలను ఒక్కసారి నాటితే 30 ఏళ్ల వరకు ఆదాయం
ఏడాదికి ఎనిమిది పంటలు..
తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు
జిల్లాలో పెరుగుతున్న మల్బరీ సాగు
కేజీ పట్టు రూ.600
పట్టు పురుగుల గూళ్ల తయారీ అనంతరం వాటి నాణ్యత ఆధారంగా ధర ఉంటుంది. ప్రస్తుతం కేజీ పట్టు ధర రూ.600 ల వరకు పలుకుతోంది. దీంతోపాటు రైతుకు అదనంగా కేజీకి రూ.75 రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా అందిస్తోంది. రైతులు సాగుచేసిన పట్టుగూళ్లు విక్రయించుకునేందుకు హైదరాబాద్‌లోని తిరుమలగిరి, వరంగల్ జిల్లాలోని జనగామలో మార్కెటింగ్ సౌకర్యం కల్పించింది.

సిరులు ఒడిసిపట్టు!

సిరులు ఒడిసిపట్టు!