గోశాల నిర్వహణకు ప్రత్యేక కమిటీ | - | Sakshi
Sakshi News home page

గోశాల నిర్వహణకు ప్రత్యేక కమిటీ

Published Tue, Jun 25 2024 12:12 AM | Last Updated on Tue, Jun 25 2024 12:12 AM

గోశాల నిర్వహణకు ప్రత్యేక కమిటీ

దాత సహకారంతో గోశాల క్లీన్‌కు బ్లేడ్‌ ట్రాక్టర్‌

ఈవో రామకృష్ణ

వేములవాడ: రాజన్న ఆలయ గోశాలలో కోడెలు అవస్థలు పడుతున్న వైనాన్ని ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన ‘గోశాలలో గోవుల గోస’ కథనానికి అధికారులు స్పందించారు. ఆలయ ఈవో రామకృష్ణ సోమవారం గోశాలను పరిశీలించారు. కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, ఇతర అధికారుల బృందం రెండు రోజుల క్రితం గోశాల నిర్వహణపై క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు చెప్పారు. ఐదుగురు సభ్యులతో కమిటీ వేశామని, కమిటీ నిర్ణయం మేరకే గోశాలలో పనులు జరుగుతాయన్నారు. ఇందుకు జూలై 1న అడిషనల్‌ కలెక్టర్‌ అధ్యక్షతన గోశాల విధివిధానాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. గోశాలను శుభ్రం చేసేందుకు ఓ దాత సహకారంతో బ్లేడ్‌ ట్రాక్టర్‌ను అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. మంగళవారం మొరం పోయిస్తామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement