సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు చర్యలు

Jun 25 2024 12:14 AM | Updated on Jun 25 2024 12:14 AM

సీజనల్‌ వ్యాధుల   నియంత్రణకు చర్యలు

సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు చర్యలు

● కలెక్టర్‌ పమేలా సత్పతి

కరీంనగర్‌టౌన్‌: సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో వానాకాలం సీజనల్‌ వ్యాధుల నియంత్రణపై జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్‌ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. కలెక్టర్‌ పమేలా సత్పతి మాట్లాడుతూ గ్రామాలు, మున్సిపాలిటీల్లో శానిటేషన్‌ ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దోమల వ్యాప్తిని నివారించాలని, మురికిగుంటల్లో ఆయిల్‌ బాల్స్‌ వేయాలన్నారు. ప్రజలు ఇండ్ల వద్ద పరిశుభ్రత పాటించాలని, బయటి ఆ హారం తీసుకోవద్దని తెలిపారు. మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయించాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని, డెంగీ, మలేరియా, విష జ్వరాలు ప్రబలకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవా లన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల నిర్వాహకులు వ్యర్థాలను మున్సిపల్‌ సిబ్బందికి కాకుండా ఏజెన్సీ వారికి అప్పగించాలని పేర్కొన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌దేశాయ్‌, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుజాత, డీపీవో రవీందర్‌, జెడ్పీ సీఈవో శ్రీనివాస్‌, మిషన్‌ భగీరథ ఈఈ అంజన్‌ రావు పాల్గొన్నారు.

ప్రైవేటు ఆస్పత్రులు నిబంధనలు పాటించాలి

ప్రైవేట్‌ ఆస్పత్రుల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో డిస్టిక్‌ రిజిస్ట్రేషన్‌ అథారిటీ కమిటీ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. ప్రైవేటు ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లపై చర్చించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రైవేట్‌ ఆస్పత్రులకు నిబంధనల మేరకు అనుమతులు ఇవ్వాలని సూచించారు. అన్ని రకాల పన్నులను సకాలంలో చెల్లించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌దేశాయ్‌, డీఎంహెచ్‌వో సుజాత, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు రామ్‌కిరణ్‌, కార్యదర్శి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

కలెక్టర్‌గా పమేలాసత్పతి కొనసాగింపు

కరీంనగర్‌ అర్బన్‌: కలెక్టర్‌గా పమేలా సత్పతి కొనసాగనున్నారు. ఈ మేరకు సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌ అనురాగ్‌ జయంతిని కరీంనగర్‌ కలెక్టర్‌గా నియమిస్తూ ఈ నెల 15న ఉత్తర్వులు వెలువడగా అనురాగ్‌ జయంతి బాధ్యతలు స్వీకరించకపోవడంతో సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో పమేలా సత్పతినే కొనసాగిస్తూ ఉత్తర్వులు వెలువడటంతో ఉత్కంఠకు తెరపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement