రైలు టికెట్ దొరకలే
ప్రయాగ్‌రాజ్‌కు రై లులో వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకునే అవకాశం లేకుండాపోయింది. రెండు నెలల క్రితమే టికెట్లు రిజర్వు అయ్యాయి. తత్కాల్ టికెట్ కోసం రెండురోజులు ప్రయత్నించినా దొరకలే. చివరకు స్నేహితులతో కలిసి ప్రత్యేక వాహనంలో వెళ్లాం.
– పానుగంటి సత్యనారాయణ,
గోలివాడ
పోలేని పరిస్థితి
కాశీకి పోదామనే ఆశ ఉంది. కానీ, రైళ్లలో పోలేని పరిస్థితి ఉంది. మా ఇంటికాడోళ్లు కాశీ, త్రివేణి సంగమం వెళ్లి పుణ్య స్నానం చేసి వస్తామని నిర్ణయించారు. కానీ రైలు టికెట్ దొరకలే. హైదరాబాద్ వెళ్లి రైలు ఎక్కాలంటే నా వయసు సహకరించడం లేదు.
– మామిడి లక్ష్మి,
సుల్తానాబాద్
టికెట్ కన్ఫమ్ కాలేదు
ప్రయాగ్‌రాజ్ వెళ్లేందుకు నెలరోజుల క్రితమే రైలు టికెట్ బుక్ చేసుకున్నం. దాణాపూర్ రైలుకు ఈనెల 16వన వెళ్లాలి. ఇంకా 30 వెయిటింగ్ లిస్టులోనే ఉంది. టికెట్ కాన్ఫమ్ కాకుంటే మా టూర్ రద్దవుతుంది. ఇన్నోవాలో వెళ్లేందుకు అంత ఓపిక లేదు.
– రావికంటి జ్యోతి,
గౌతమినగర్
అధికారులకు విన్నవించాం
కరీంనగర్ – పెద్దపల్లి, రామగుండం నుంచి ప్రయాగ్‌రాజ్‌కు ప్రత్యేక రైలు ను నడిపించాలని కోరా. రామగుండం నుంచి బొగ్గు ర వాణాతో రైల్వేకు రూ.వేల కోట్ల ఆదా యం వస్తోంది. ఇక్కడివారి కోసం ప్రత్యేక రైలు నడిపించాలని రైల్వే జీఎం, డీఆర్‌ఎంలకు విన్నవించా.
– శ్రీనివాస్,
రైల్వే ప్రజాసంబంధాల ప్రతినిధి
రైలు టికెట్ దొరకలే
రైలు టికెట్ దొరకలే
రైలు టికెట్ దొరకలే
Comments
Please login to add a commentAdd a comment