త్వరలో మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ
● ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య
● దీక్ష విరమించిన జేఏసీ సభ్యులు
తిమ్మాపూర్: మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట నెలకొల్పిన అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాల ముసుగు త్వరలో తొలగించి ఆవిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. విగ్రహాలను ఆవిష్కరించాలని జేఏసీ పక్షాన 17 రోజులుగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న వారికి వెంకటయ్య నిమ్మరసం ఇచ్చి విరమింపజేయించారు. పార్టీలకతీతంగా స్ఫూర్తి చాటారని, విగ్రహాల ఆవిష్కరణలో ఎదురవుతున్న సమస్యలను ఎమ్మెల్యే సత్యనారాయణ, మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటుగా సంబంధిత అధికార వర్గాలతో మాట్లాడి పరిష్కారం సాధిద్దామన్నారు. దీక్షలకు మద్దతు ప్రకటించిన అంబేడ్కర్ సంఘాల కార్యదర్శి, టీడీపీ రాష్ట్ర నాయకులు దామెర సత్యం, మేడి మహేశ్ మాట్లాడుతూ మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ విషయంలో నిర్లక్ష్యం చేయొద్దన్నారు. జేఏసీ సభ్యులు మాతంగి శంకర్,దుండ్ర రాజయ్య,వంతడుపుల సంపత్, సుగుర్తి జగదీశ్వరాచారి,కనకం రాములు,మేడి అంజయ్య, ఎలుక ఆంజనేయులు,సముద్రాల లక్ష్మణ్ తదితరులకు నిమ్మరసం ఇచ్చి విరమింపచేశారు. విశ్రాంత ఉద్యోగి కుమారస్వామి, మాజీ వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, మాజీ సర్పంచ్ వడ్లూరి శంకర్, మాతంగి లక్ష్మ ణ్, పాశం అశోక్‌రెడ్డి, బోయిని తిరుపతి, కామెర వెంకటేశ్, కోయడ మురళి, మాచర్ల అంజయ్య, రెడ్డిగాని రాజు, సంగుపట్ల మల్లేశం, రావుల శ్రీనివాస్, తూముల శ్రీనివాస్ పాల్గొన్నారు.