రాజన్న హుండీ ఆదాయం రూ.1.95 కోట్లు
వేములవాడ: రాజన్నకు 20 రోజుల్లో రూ.1,95,75,168 నగదుతోపాటు 287 గ్రాములు బంగారం, 18.500 కిలోల వెండి సమకూరిటన్లు ఈవో కొప్పుల వినోద్‌రెడ్డి తెలిపారు. గుడి ఓపెన్‌స్లాబ్‌లో బుధవారం సీసీ కెమెరాల నిఘా మధ్య లెక్కించారు. నాంపల్లి శ్రీలక్ష్మీ నరసింహస్వామి హుండీ ఆదాయం ఆరు నెలలకు రూ.11,47,510 వచ్చినట్లు ఈవో తెలిపారు.
చిన్నారులపై పిచ్చికుక్కల దాడి
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని జాంబాగ్ ప్రాంతంలోని ఇద్దరు చిన్నారులపై బుధవారం సాయంత్రం పిచ్చికుక్కలు దాడిచేశాయి. జాంబాగ్ ప్రాంతానికి చెందిన అసిమా, జోయబ్ అనే ఇద్దరు చిన్నారులు ఇంటి ఎదుట ఆడుకుంటుండగా పిచ్చికుక్కలు దాడిచేశాయి. వెంటనే గాయపడిన చిన్నారులను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.
రాజన్న హుండీ ఆదాయం రూ.1.95 కోట్లు
రాజన్న హుండీ ఆదాయం రూ.1.95 కోట్లు