ఎస్సారెస్పీ కాలువలో గుర్తుతెలియని మృతదేహం | - | Sakshi
Sakshi News home page

ఎస్సారెస్పీ కాలువలో గుర్తుతెలియని మృతదేహం

Apr 2 2025 12:58 AM | Updated on Apr 2 2025 12:58 AM

ఎస్సా

ఎస్సారెస్పీ కాలువలో గుర్తుతెలియని మృతదేహం

జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్‌ మండలం నర్సింగాపూర్‌ శివారులోని ఎస్సారెస్పీ కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం మంగళవారం లభ్యమైంది. 35 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సుగల వ్యక్తి శరీరంపై బ్రౌన్‌కలర్‌ ఫార్మల్‌ పాయింట్‌, మెరూన్‌, నలుపు రంగు పొడుగు గీతలు, ఫుల్‌ హ్యాండ్స్‌ చొక్క ఉందని రూరల్‌ ఎస్సై సదాకర్‌ తెలిపారు. మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చామని పేర్కొన్నారు.

వీవింగ్‌ మిల్లు కార్మికుడి మృతి

రామగుండం: అంతర్గాం టీటీఎస్‌ కాలనీకి చెందిన వీవింగ్‌ మిల్లు కార్మికుడు బోకం నాయుడు (60) మంగళవారం మృతి చెందాడు. వీవింగ్‌ మిల్లు నుంచి ప్రయోజనాలకు సంబంధించిన బకాయిలు రావాల్సి ఉంది. ఆ సొమ్ము చూడకుండానే నాయకుడు మృతి చెందాడు. ఇప్పటికే పదుల సంఖ్యలో కార్మికులు బకాయిలు పొందకుండానే మృతి చెందారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి తక్షణమే బకాయిలను చెల్లించాలని బర్మా, కాందీశీకుల సంఘం ప్రతినిధులు జమ్ముల రామారావు, ఇండిబిల్లి రవీందర్‌ కోరుతున్నారు.

విద్యుత్‌ షాక్‌తో కౌలురైతు..

గంగాధర(చొప్పదండి): మండలంలోని కురిక్యాల గ్రామానికి చెందిన కౌలురైతు ఒగ్గరి ప్రశాంత్‌(38) విద్యుత్‌షాక్‌తో మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. ప్రశాంత్‌ గ్రామంలోనే మూడెకరాల వ్యవసాయ భూమి కౌలుకు తీసుకొని వరి పంటసాగు చేస్తున్నాడు. మంగళవారం వేకువజామున కరెంట్‌ మోటార్‌ పెట్టేందుకు పొలం వద్దకు వెళ్లాడు. ఫీజులు, స్టార్టర్‌ డబ్బా కాలిపోయి విద్యుత్‌ వైర్లు విడిపోయి ఉన్నా యి. విషయం తెలియక మోటార్‌ ఆన్‌ చేసేందుకు బాక్స్‌ ముట్టుకోగానే విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పరామర్శించారు.

కారు డ్రైవర్‌పై కేసు నమోదు

ధర్మపురి: అతి వేగంగా.. అజాగ్రత్తగా కారు నడిపి ఓ యువకుడి మృతికి కారణమైన కారు డ్రైవర్‌పై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉదయ్‌కుమార్‌ తెలిపారు. మండలంలోని తుమ్మెనాల గ్రామానికి చెందిన తొందుర్తి రాజేందర్‌ ధర్మపురిలోని వెంకటేశ్వర షాపులో సేల్స్‌ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి పని ముగించుకుని ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ధర్మపురి సమీపంలోని నర్సయ్యపల్లి స్టేజీ వద్ద ధర్మపురి నుంచి జగిత్యాల వైపునకు వెళ్తన్న కారు డ్రైవర్‌, మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవుకు చెందిన తమ్ముడి వినోద్‌ అజాగ్రత్తగా కారు నడిపి ఢీకొట్టాడు. ఈ ఘటనలో రాజేందర్‌ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య గంగరాజు ఫిర్యాదు మేరకు దీంతో డ్రైవర్‌ వినోద్‌పై కేసు నమోదు చేశామని ఎస్సై పేర్కొన్నారు.

ఎస్సారెస్పీ కాలువలో  గుర్తుతెలియని మృతదేహం1
1/1

ఎస్సారెస్పీ కాలువలో గుర్తుతెలియని మృతదేహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement