
తంగళ్లపల్లి (సిరిసిల్ల): కరోనా టీకా తీసుకున్న ఓ వ్యక్తి అనారోగ్యానికి గురై చనిపోయాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామంలో అద్దె ఇంట్లో ఉంటున్న జక్కని లక్ష్మణ్ (51) చేనేత కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శుక్రవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టీకా వేయించుకున్నాడు.
అప్పట్నుంచే జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నాడు. కాగా, సోమవారం అతని ఆరోగ్య పరిస్థితి విషమించింది. కుటుంబసభ్యులు వెంటనే సిరిసిల్ల ప్రాంతీయ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు. కరోనా వ్యాక్సిన్‌తోనే లక్ష్మణ్ చనిపోయాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. టీకా వేయడంతోనే లక్ష్మణ్ చనిపోయాడనే ఆరోపణల్లో నిజం లేదని పీహెచ్‌సీ మెడికల్ అధికారి సంతోష్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment