ఎన్నికల ప్రణాళికను విడుదల చేస్తున్న దృశ్యం
బళ్లారిటౌన్: కర్ణాటక రాష్ట్ర సమితి ( కేఆర్‌ఎస్) జిల్లాలోని మూడు నియోజక వర్గాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్లు ఆ పార్టీ జిల్లాధ్యక్షుడు కాపు శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు జాబితా విడుదల చేశారు. బళ్లారి నగర అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించారని, గ్రామీణ అభ్యర్థిగా కావలి మారెణ్ణ, సిరుగుప్పకు అభ్యర్థి దొడ్డయల్లప్పను ఖరారు చేసినట్లు తెలిపారు. సండూరు, కంప్లి అభ్యర్థులుగా మహిళలకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం పార్టీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. పార్టీ అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను ఏడాదిలోగా భర్తీ చేస్తామన్నారు. సంపూర్ణ మద్య నిషేదం అమలు చేస్తామని, ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు.
టెక్స్‌టైల్ పార్కు
మంజూరు చేయండి
రాయచూరు రూరల్: రాయచూరుకు మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేయాలని దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యుడు బాబురావ్ డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం ధార్వాడలో కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషికి వినతిపత్రం సమర్పించారు.
పంచరత్న యాత్రకు శ్రీకారం
రాయచూరు రూరల్ : రాయచూరులోని అశాపూర్ రహదారిలో జేడీఎస్ నాయకులు శనివారం పంచరత్నయాత్రకు శ్రీకారం చుట్టారు. నగరసభ మాజీ అధ్యక్షుడు వినయ్ కుమార్ ఇంటింటీకి వెళ్లి..కుమారస్వామి హయాంలో చేపట్టిన విద్య, ఆరోగ్య, రైతు సంక్షేమ పథకాలను వివరించారు.


