
ధ్వంసమైన బైక్
హోసూరు: ఒక్క క్షణం అజాగ్రత్త వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో విలువైన ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా మసలుకుంటే ఎన్నో కుటుంబాలకు విషాదం తప్పుతుంది. హోసూరు, బేరికె ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు.
ట్రాక్టర్ బోల్తా పడి
సేలం జిల్లా మేటూరు ప్రాంతానికి చెందిన అయ్యనార్ (27) బేరికె దగ్గర సీకనపల్లిలో ఓ కంకర క్వారీలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం బండరాళ్లను తీసుకొని వెళుతుండగా అదుపుతప్పి బోల్తాపడింది. తీవ్ర గాయాలేర్పడిన అయ్యనార్‌ను స్థానికులు చికిత్స కోసం హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఫలితంలేక మృతి చెందాడు.
బైక్‌పై పెద్ద వాహనం దూసుకెళ్లి
సూళగిరి అన్నానగర్‌కు చెందిన కూలికార్మికుడు నాగరాజ్ బైక్ మీద బాగలూరు వైపు వెళుతుండగా ముందు వెళుతున్న వాహనాన్ని ఢీకొని కిందపడ్డాడు. వెనుక వస్తున్న పెద్ద వాహనం అతని మీద నుంచి దూసుకెళ్లడంతో నాగరాజ్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. హోసూరు సమీపంలోని జొనబండ గ్రామానికి చెందిన గోవిందప్ప (45). శనివారం సాయంత్రం అదే ప్రాంతంలోని గెరగమ్మ ఆలయం వద్ద నడచి వెళుతుండగా లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలేర్పడిన అతన్ని ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి చనిపోయాడు. ఈ ప్రమాదాలపై స్థానిక పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు.
బావిలోకి జారిపడి మహిళ మృతి
బావిలోకి జారిపడి మహిళ మరణించింది. వివరాల మేరకు బేరికె సమీపంలోని తట్టనపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ భార్య యశోద (24). వీరికి గత ఆరేళ్ల క్రితం పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలున్నారు. యశోద శనివారం వ్యవసాయ పొలంలోని బావికెళ్లింది. ఈ సమయంలో బావిలోకి జారిపడడంతో ఎవరూ కాపాడేవారు లేకపోయారు. నీటమునిగి మృత్యువాత పడింది. బేరికె పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని స్వాధీనపరుచుకొని ఆస్పత్రికి తరలించారు.

పంచాయతీ అధ్యక్షులతో చర్చిస్తున్న కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment