Bengaluru Police Arrest Tamil Nadu Couple for Robbing Tomato-Laden Truck Near City - Sakshi
Sakshi News home page

టమాటా దొంగలు అరెస్ట్‌

Published Sun, Jul 23 2023 12:12 AM | Last Updated on Sun, Jul 23 2023 6:41 PM

- - Sakshi

కర్ణాటకటమాటాలతో ఉన్న బోలెరో వాహనంతో పరారైన దంపతులను బెంగళూరు ఆర్‌ఎంసీ యార్డ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు...చిత్రదుర్గ జిల్లా చెళ్లకెరె నివాసి రైతు మల్లేశ్‌ ఈ నెల 8న 210 బాక్సుల టమాటాలను లోడ్‌ చేసుకుని బొలెరో వాహనంలో చెళ్లకెరె నుంచి కోలారు మార్కెట్‌కు బయలుదేరారు. రాత్రి 10:45 గంటల సమయంలో డ్రైవర్‌ శివణ్ణతో కలిసి మార్గంమధ్యలోని తుమకూరు రోడ్డు సీఎంటీఐ నుంచి హెబ్బాళ వైపు వెళ్తూ టీ తాగటానికి మల్లేశ్‌, శివణ్ణలు ఓ హోటల్‌ వద్ద వాహనం నిలిపారు.

ఈ సమయంలో బొలెరో అపహరణకు గురైంది. ఇందుకు సంబంధించి ఆర్‌ఎంసీ యార్డ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు తమిళనాడుకు చెందిన దంపతులు భాస్కర్‌ (38), సింధు (36)లను అరెస్ట్‌ చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరుకు చెందిన ఇద్దరు సహకారంతో తమిళనాడుకు చెందిన దంపతులు చోరీ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

టమాటాలను అమ్మగా వచ్చిన రూ.1.5 లక్షలు నగదును ఐదుగురు సమానంగా పంచుకున్నారు. దంపతులను అరెస్ట్‌ చేయటంతో మిగిలిన ముగ్గురు పరారీ అయ్యారు. నిందితులు కారులో వెంబడించి బులెరో వాహనాన్ని ఢీకొట్టడానికి యత్నించి అది సాధ్యం కానీ పక్షంలో బొలెరోను అపహరించుకుని పరారైనట్లు పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement