కర్ణాటక: రిజర్వు బ్యాంకు ముద్రించిన రూ.10 నాణేలు చెల్లుబాటులో ఉన్నాయని, ప్రజలు వాటిని ఎలాంటి సంకోచం లేకుండా ఉపయోగించవచ్చని జిల్లాధికారి అక్రం పాషా తెలిపారు. శనివారం నగరంలోని కలెక్టరేట్ సభాంగణంలో జిల్లా లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. పలు చోట్ల రూ.10 నాణేన్ని ఆర్‌బీఐ నిషేధించిందని తప్పుడు వదంతులు సృష్టించారన్నారు.
దీనిపై ప్రజల్లో గందరగోళం ఏర్పడిందన్నారు. అయితే ఈ విషయంలో ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దన్నారు. రూ.10 నాణేన్ని ఆర్‌బీఐ నిషేధించలేదన్నారు. లీడ్ బ్యాంకు మేనేజర్ సుధీర్ మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురికావద్దన్నారు. బ్యాంకుల్లో కూడా డిపాజిట్ చేయవచ్చన్నారు. రూ.10 నాణేలను స్వీకరించకపోతే 2011 సెక్షన్ 6(1) ప్రకారం చట్ట ఉల్లంఘన అవుతుందన్నారు. రూ.10 నాణేలను ఉపయోగించడం వల్ల చిల్లర సమస్య పరిష్కారమవుతుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment