ఇద్దరిని బలిగొన్న ఫ్యాక్టరీ బస్సు
హోసూరు వార్తలు..
కెలమంగలం: ద్విచక్రవాహనాన్ని ప్రైవేట్ కంపెనీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు కూలీ కార్మికులు మృతి చెందారు. ఆవేశానికి గురైన బాధిత బంధువులు పరిశ్రమకు చెందిన ఆరు బస్సులను ధ్వంసం చేశారు. ఈ ఘటన కెలమంగలం పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకొంది. వివరాల మేరకు ఉద్దనపల్లి సమీపంలో నిర్వహిస్తున్న టాటాఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఉద్యోగులను తరలించేందుకు పరిశ్రమ యంత్రాంగం బస్సులను నడుపుతోంది. రాత్రి 10 గంటల ప్రాంతంలో విధుల కోసం ఉద్యోగులను తీసుకెళుతున్న బస్సు కెలమంగలం కూడలి రోడ్డు వద్ద ఓ బైక్‌ను ఢీకొనింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న బోడిచిపల్లి గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికులు కుమార్, గణేష్‌లు తీవ్ర గాయాలతో చనిపోయారు.
బస్సులపై దాడులు
విషయం తెలుసుకొన్న గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ కంపెనీల బస్సులను అడ్డగించి అద్దాలను పగలగొట్టారు. ఎస్పీ తంగదురై, హోసూరు ఏఎస్పీ, డెంకణీకోట డీఎస్పీ, కెలమంగలం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో చర్చించి ఆందోళన విరమించుకొన్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కొద్ది సేపు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
గ్రామస్తుల ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment