సీఎం రాజీనామా కోసం ఉద్యమించిన బీజేపీ
మైసూరు: ముడా వ్యవహారంలో సీఎం సిద్దరామయ్య రాజీనామా చేయాలని, హైకోర్టుకు వ్యతిరేకంగా మాట్లాడిన మంత్రి జమీర్‌ఖాన్‌ను డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు ఉద్యమించారు. శుక్రవారం జెడ్పీ కార్యాలయ సభాంగణంలో నిర్వహిస్తున్న కేడీపీ సమావేశాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే టీఎస్ శ్రీవత్స బీజేపీ నగర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎల్.నాగేంద్ర, బీజేపీ మైసూరు గ్రామీణ జిల్లాధ్యక్షుడు ఎల్‌ఆర్ మహదేవస్వామి తదితరులు సీఎం సిద్దరామయ్య పాల్గొన్న కేడీపీ సమావేశాన్ని ముట్టడించేందుకు బయలుదేరగా బ్యారికేడ్లను పెట్టిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని వ్యాన్లు, బస్సుల్లోకి ఎక్కించి తరలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సిద్దరామయ్యకు సీఎంగా కొనసాగే ఎలాంటి నైతిక హుక్కు లేదన్నారు. పదవికి రాజీనామా చేసి లోకాయుక్త దర్యాప్తును ఎదుర్కోవాలన్నారు. నగర మాజీ మేయర్ శివకుమార్, కేంద్ర మాజీ మంత్రి భగవంత ఖూబా, వస్తుప్రదర్శన ప్రాధికార మాజీ అధ్యక్షుడు హేమంత్ కుమార్‌గౌడ, బీజేపీ ప్రధాన కార్యదర్శులు హెచ్‌జీ గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment