
బొమ్మనహళ్లి: మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) అక్రమ భూ కేటాయింపుల కేసుకు సంబంధించి నగరాభివృద్ది కార్యదర్శి, ఐఏఎస్ అధికారిణి దీపా చోళన్ మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరయ్యారు. ఉదయం బెంగళూరు నగరంలోని శాంతి నగరలో ఉన్న ఈడీ కార్యాలయానికి వచ్చారు.
ముడాలో కొన్ని పత్రాలు కనిపించకుండా పోయాయని, మరికొన్నింటిని దిద్దారనే ఆరోపణలు నేపథ్యంలో ఆమెకు ఈడీ నోటీసు ఇచ్చారు. దీంతో ఆమె ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. ఈడీ అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ఈ కేసులో సీఎం కుటుంబంతో పాటు పలువురు అధికారులను కూడా ఈడీ ఇప్పటికే విచారణ చేయడం తెల్సిందే.