నేపాలీ జంట కోసం ఇంటర్‌పోల్‌కు మొర | - | Sakshi
Sakshi News home page

నేపాలీ జంట కోసం ఇంటర్‌పోల్‌కు మొర

Jan 9 2025 12:37 AM | Updated on Jan 9 2025 1:58 PM

-

యశవంతపుర: నగల షాపు యజమాని ఇంట్లో పనిచేస్తూ రూ.15.15 కోట్ల విలువగల బంగారాన్ని దోచుకెళ్లిన నేపాలీ జంట ఆచూకీ లేదు. కొన్ని నెలల కిందట సురేంద్రకుమార్‌ జైన్‌ ఇంటిలో నేపాల్‌కు చెందిన నేమిరాజ్‌ దంపతులు పనిచేస్తూ నమ్మకంగా ఉండేవారు. నవంబర్‌ 1న జైన్‌ కుటుంబం గుజరాత్‌లో ఇంటి పండగుక వెళ్లినప్పుడు నేమిరాజ్‌ దంపతులు డబ్బు బంగారంతో ఉడాయించారు. అప్పటినుంచి పోలీసులు గాలిస్తున్నా జాడ లేదు. నేపాల్‌కు పారిపోయి దాక్కున్నట్లు అనుమానం. బెంగళూరు పోలీసులకు కష్టతరంగా మారడంతో ఇంటర్‌పోల్‌కు సమాచారమిచ్చారు. వారి ఆచూకీ తెలిస్తే చెప్పాలని అభ్యర్థించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement