
నీటి పొదుపుపై అవగాహన కల్పించండి
బళ్లారిటౌన్: నైసర్గిక సంపన్మూలమైన నీరు మన అందరికీ అత్యవసరమని, పొదుపుగా నీటి వినియోగంపై అవగాహన కల్పించాలని జిల్లా పంచాయతీ సీఈఓ రాహుల్ శరణప్ప సంకనూరు పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఓ ప్రైవేట్ హోటల్‌లో గ్రామీణ తాగునీరు నైర్మల్య శాఖ, జిల్లా పంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టిన జలజీవన్ మిషన్ పథకంపై సదస్సులో పాల్గొని మాట్లాడారు. దేశాభివృద్ధిలో గ్రామాల అభివృద్ధి పాత్ర ప్రముఖమైనదన్నారు. గ్రామ పంచాయతీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమగ్ర గ్రామ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. 24 గంటలు నీరందించే జలజీవన్ మిషన్ పథకం అమలు చేయాలన్నారు. ప్రజలు నీటి వృథా కాకుండా సద్వినియోగం చేసుకోనేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా పలు గ్రామ పంచాయతీ అధ్యక్షులకు ప్రమాణపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో నైర్మల్య శాఖ ఈఈ హెచ్.ఇందూధర్, ఫీడ్‌బ్యాంక్ ఫౌండేషన్ సీఈఓ అజయ్‌సిన్హ, అధికారులు తిప్పేస్వామి, నందకుమార్, ఓంకార్, అభిషేక్, శశికాంత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment