● నగదు జప్తుతో బాధితుని
ఆత్మహత్యాయత్నం
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో ఇటీవల మైక్రో ఫైనాన్స్, వడ్డీ వ్యాపారుల వల్ల పలువురు ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో తనిఖీలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా బుధవారం గదగ్‌లో సంగమేష్ దొడ్డణ్ణ అనే వ్యక్తి ఇంట్లో పోలీసులు అనుమానం వచ్చి తనిఖీ చేయగా రూ.26 లక్షల నగదు లభించింది. వడ్డీవ్యాపారి ఇంట్లో పోలీసుల తనిఖీలో డబ్బులు పట్టుబడటంతో హైడ్రామా చోటు చేసుకుంది. సదరు వడ్డీ వ్యాపారి తన ఆరోగ్యం కోసం ఆస్పత్రి ఖర్చుల కోసం డబ్బులు తెచ్చుకున్నానని, తనకున్న కాలేయ సమస్యకు రూ.20లక్షలకు పైగా ఖర్చు అవుతుందని వైద్యులు తెలపడంతో డబ్బులు తీసుకుని వస్తే పోలీసులు పట్టుకుని స్వాధీనం చేసుకోవడంతో తన పరిస్థితి ఏమిటని ఆవేదన చెంది సంగమేష్ ఆత్మహత్యాయత్నం చేయడంతో స్థానికులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించి చికత్స చేయించగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన గదగ్ పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. అక్కడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment