పీఎంఏవై నిధులు మంజూరు చేయండి
రాయచూరు రూరల్: రాష్ట్రంలో మురికి వాడల ప్రాంతాల్లో నివాసమున్న వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) పథకంలో మంజూరైన ఇళ్లకు నిధులు మంజూరు చేయాలని అఖిల కర్ణాటక భువనేశ్వరి సేన సమితి అధ్యక్షుడు తమేష్ పేర్కొన్నారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగరంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు. రూ.6 లక్షల్లో కేవలం స్లంబోర్డు అధికారులు రూ.3 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. సగానికే నిర్మాణాలు చేపట్టి మిగిలిన భాగాన్ని పూర్తి చేయాలంటే ప్రభుత్వం నిధులు విడుదల చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment