ముగ్గురు ప్రొఫెసర్లకు డాక్టరేట్
బళ్లారిఅర్బన్: రావ్ బహద్దూర్ వై.మహాబలేశ్వరప్ప ఇంజినీరింగ్ కాలేజీ(ఆర్‌వైఎంఈసీ)కి చెందిన ముగ్గురు ప్రొఫెసర్లకు బెళగావిలోని విశ్వేశ్వరయ్య సాంకేతిక విశ్వవిద్యాలయం(వీటీయూ) పీహెచ్‌డీ పట్టాలను ప్రకటించింది. డాక్టర్ ప్రదీప్ బీ.జ్యోతి మార్గదర్శకత్వంలో ఆ కళాశాల ఈఈ లెక్చరర్ డాక్టర్ లింగనగౌడ సమర్పించిన ప్రత్యేక వ్యాసానికి పట్టా దక్కింది. కలబుర్గి పీడీఏసీఈ ప్రొఫెసర్ డాక్టర్ కల్పన వంజఖేడ్ మార్గదర్శకత్వంలో సదరు కళాశాల ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ లెక్చరర్ డాక్టర్ రాఖీపాటిల్ ప్రతిపాదించిన ప్రత్యేక వ్యాసానికి పీహెచ్‌డీ లభించింది. పీడీఐటీ ప్రిన్సిపాల్ డాక్టర్ యూఎం రోహిత్ మార్గదర్శకత్వంలో బళ్లారి ఆర్‌వైఎంఈసీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో డాక్టర్ ప్రశాంత్ కేణి ప్రతిపాదించిన ప్రత్యేక వ్యాసానికి పీహెచ్‌డీ లభించిందని ఆ కళాశాల అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
బాలికపై లైంగిక దాడి
నిందితుని అరెస్ట్
హుబ్లీ: మైనర్ బాలికపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడిన కేసులో 49 ఏళ్ల వయస్సుగల వ్యక్తిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టినట్లు హుబ్లీ ధార్వాడ పోలీస్ కమిషనర్ ఎన్.శశికుమార్ తెలిపారు. కేశ్వాపుర పోలీస్ స్టేషన్‌లో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 18న బాధిత మహిళ హుబ్లీ కేశ్వాపుర పోలీస్ స్టేషన్‌కు వచ్చి 2023లో తాను మైనర్‌గా ఉన్నప్పుడు స్థానిక నివాసి తన తల్లిదండ్రుల ప్రాణాలు తీస్తానని బెదిరించి తనను ఇంటికి తీసుకెళ్లి ఒత్తిడి చేసి లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. నిందితుడు మరికొందరిని కూడా మోసం చేశాడని ఆరోపణలు వచ్చాయని, ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు చేపడతామన్నారు. ఇతడి వల్ల ఎవరైనా మోసపోయి ఉంటే తమకు దగ్గరలోని పోలీసు స్టేషన్‌కు తెలియజేయాలని ఆయన కోరారు.
ఆస్పత్రి పైనుంచి దూకి
రోగి ఆత్మహత్య
హుబ్లీ: కలబుర్గి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరిన క్షయ రోగి బుధవారం సదరు ఆస్పత్రి రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని స్థానిక జంజం కాలనీ డెక్కన్ కళాశాల సమీప నివాసి సయ్యద్ అజరుద్దీన్ (33)గా గుర్తించారు. కొన్ని రోజుల క్రితం అతడిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు. అనారోగ్యంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. కాగా ఆస్పత్రి వైద్యులు, పాలన యంత్రాంగం నిర్లక్ష్యమే ఆత్మహత్యకు కారణం అని మృతుడి భార్య బ్రహ్మపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆస్తి పన్ను చెల్లించి
బీ.ఖాతా పొందండి
బళ్లారిటౌన్: జిల్లాలోని నగర, స్థానిక సంస్థల వ్యాప్తిలోని ప్రజలు తమ ఆస్తులకు పన్నులు చెల్లించి బీ ఖాతా పొందాలని జిల్లాధికారి ప్రశాంత్‌కుమార్ మిశ్రా సూచించారు. ఆ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేస్తూ ప్రభుత్వం, ప్రభుత్వేతర శాఖల మండళ్ల స్థలాలు మినహా అనధికారిక లేఅవుట్లు, ఆర్‌ఎస్ ప్లాట్లలో తమ సొంత ఆస్తుల స్థలాల్లో అనధికారికంగా నిర్మించుకున్న కట్టడాలు 2024 సెప్టెంబర్ 10లోగా ఖరీదు చేసి రిజిస్టర్ చేసుకున్న ఆస్తులు మహానగర పాలికె, నగరసభ, పురసభ, పట్టణ పంచాయతీల్లో బీ ఖాతా పొందవచ్చన్నారు. ఒక్కసారి మాత్రం మే 10 లోగా అర్జీలు సమర్పించి 2024–25వ సంవత్సరంలో ఆస్తి పన్నును రెండింతలు జరిమానాతో చెల్లించితే పాలికెలో నమూన 2ఏ, ఇతర నగర స్థానిక సంస్థల పరిధిలో నమూన 3ఏ పొందే అవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని, మరిన్ని వివరాలకు పాలికె సహాయ వాణి కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.
వికసిత భారత్
అందరి బాధ్యత కావాలి
బళ్లారిఅర్బన్: మనకు దొరికిన పౌరసత్వాన్ని బాధ్యతగా నిర్వహించాలని బెళగావి రాణి చెన్నమ్మ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సీఎం త్యాగరాజ్ తెలిపారు. బుధవారం విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని డాక్టర్ అంబేడ్కర్ సభాభవనంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రిసెర్చ్ సౌత్ రీజినల్ సెంటర్ హైదరాబాద్, వీఎస్‌కేయూ రాజనీతి శాస్త్ర అధ్యయన విభాగం ఆధ్వర్యంలో వికసిత భారత్– 2047 భారత్‌లో రాజ్యాంగం, శాసకాంగం, న్యాయాంగంలో సంస్కరణల గురించి రెండు రోజుల జాతీయ సమ్మేళనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వికసిత భారత్ అభివృద్ధి కల అందరి బాధ్యత కావాలన్నారు. పలువురు రాజకీయ మేధావులు సమాజాన్ని అభివృద్ధి వైపునకు నడిపించేందుకు ఎంతో కృషి చేశారన్నారు. మన హక్కులు బాధ్యతల గురించి ప్రశ్నించే మనసత్వం బలపడాలన్నారు. ఏపీలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్రం ప్రాధ్యాపకులు రామరెడ్డి, వీఎస్‌కేయూ రిజిస్ట్రార్ రుద్రేష్, వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మునిరాజు, ప్రముఖులు డాక్టర్ గౌరి మానిక మానస, సమ్మేళనం నిర్వాహకులు డాక్టర్ విజయ్‌కుమార్, డాక్టర్ మోహన్ దాస్‌తో పాటు అన్ని విభాగాల ముఖ్యస్తులు, బోధన, బోధనేతర సిబ్బంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 150 మంది పరిశోధన విద్యార్థులు పాల్గొన్నారు.
ముగ్గురు ప్రొఫెసర్లకు డాక్టరేట్
ముగ్గురు ప్రొఫెసర్లకు డాక్టరేట్
ముగ్గురు ప్రొఫెసర్లకు డాక్టరేట్
ముగ్గురు ప్రొఫెసర్లకు డాక్టరేట్
Comments
Please login to add a commentAdd a comment