తుంగభద్రా నదిలో వైద్యురాలి గల్లంతు
సాక్షి,బళ్లారి/హొసపేటె: సరదాగా వీకెండ్ ట్రిప్ కోసం హైదరాబాద్ నుంచి స్నేహితులతో కలిసి వచ్చిన వైద్యురాలు ఈత వచ్చినా తుంగభద్ర నదిలో కొట్టుకుపోయింది. బుధవారం కొప్పళ జిల్లా సణాపురం సమీపంలోని తుంగభద్ర నది పక్కన ఎత్తుగా ఉన్న కొండలు, కింద తుంగభద్ర నది పారే గలగల చప్పుళ్లు సందర్శకులను ఎంతో ఆకట్టుకుంటుంది. వీకెండ్ ట్రిప్ కోసం స్నేహితులతో కలిసి వచ్చిన హైదరాబాద్‌కు చెందిన వైద్యురాలు అనన్య రావు (27), స్నేహితులు సాత్విక్, హర్షితలతో కలిసి హంపీ టూర్‌కి వచ్చింది. ఆమె హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తోంది. ముందుగా ఒకసారి కొండ మీద నుంచి తుంగభద్ర నదిలోకి సరదాగా దూకి ఈత కొడుతూ అవతలి గట్టుకు చేరుకుంది. ఒక స్నేహితుడు, స్నేహితురాలు ఇద్దరు నది ఇటు వైపు నుంచి ఆమె దూకడం, ఈత కొట్టడం వంటి దృశ్యాలను సెల్‌ఫోన్‌లో వీడియో కూడా తీశారు. ఒకసారి సరదాగా బయటకు రావడంతో మరోసారి కూడా దూకి వస్తానని చెప్పిందో, లేక స్నేహితులే చెప్పారో తెలియదు కాని సదరు వైద్యురాలు అనన్య కొండ మీద నుంచి మళ్లీ దూకింది.
క్షణాల్లో కొట్టుకుపోయింది..
అప్పటికే అలసిపోయిన డాక్టర్ అనన్య అవతలి గట్టుకు చేరుకునేందుకు ఈత కొడుతుండగా, క్షణాల్లో కొంత నీటి ప్రవాహం పెరగడంతో ఈత కొట్టలేక ప్రవాహంలో ముందుకు కొట్టుకుపోయింది. పక్కనే స్నేహితులు చూస్తుండగానే రాళ్ల మధ్యలో నీటి ప్రవాహంలోకి కొట్టుకుపోయి కనిపించకుండా పోయింది. దీంతో స్నేహితులు పోలీసులకు, బంధువులకు సమాచారం తెలియజేశారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, గజ ఈతగాళ్లు రంగంలోకి దికి నీటిలో కొట్టుకుపోయిన వైద్యురాలి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్థానికులు, అధికారులు, అగ్నిమాపక సిబ్బంది కృషి చేసినా వైద్యురాలి ఆచూకీ దొరకకపోవడంతో మరింత సాంకేతికత, ఈతగాళ్ల సాయంతో శవాన్ని వెలికితీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనపై కొప్పళ జిల్లా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.
ఈత కొట్టాలని బండరాయిపై నుంచి దూకి మిస్సింగ్
వీకెండ్ హంపీ టూర్‌లో విషాద ఘటన
స్వస్థలం హైదరాబాద్
తుంగభద్రా నదిలో వైద్యురాలి గల్లంతు
Comments
Please login to add a commentAdd a comment